జమిలి ఎన్నికలు : పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన

Siva Kodati |  
Published : Jul 22, 2022, 03:29 PM IST
జమిలి ఎన్నికలు : పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన

సారాంశం

దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసిన జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం ప్రస్తుతం లా కమీషనర్ పరిశీలినలో వుందని తెలిపింది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం లా కమీషనర్ పరిశీలనలో వుందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని కేంద్రం పేర్కొంది. జమిలి ఎన్నికలపై అనేక భాగస్వామ్య పక్షాలతోనూ చర్చించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని తెలిపింది. నివేదిక ఆధారంగా లా కమీషన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిందని పేర్కొంది. ఎనిమిదేళ్లలో రూ.7 వేల కోట్లకు పైగా ఎన్నికల వ్యయం అయ్యిందని కేంద్రం తెలిపింది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి