‘‘ స్నేహితుల కోసం చుక్కలు తెమ్మన్నా తెస్తారు.. కానీ వృద్ధుల‌కు రైళ్ల‌లో రాయితీ ఇవ్వ‌రు’’ - రాహుల్ గాంధీ

Published : Jul 22, 2022, 04:26 PM ISTUpdated : Jul 22, 2022, 04:28 PM IST
‘‘ స్నేహితుల కోసం చుక్కలు తెమ్మన్నా తెస్తారు.. కానీ వృద్ధుల‌కు రైళ్ల‌లో రాయితీ ఇవ్వ‌రు’’ - రాహుల్ గాంధీ

సారాంశం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన స్నేహితుల కోసం ఏమైనా చేస్తుందని, కానీ పౌరుల కోసం, అలాగే సీనియర్ సిటిజన్ల కోసం రైల్వే రాయితీలను మాత్రం ఇవ్వడం లేదని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నిలిపివేసిన రైల్వే రాయితీలను పునరుద్దరించే ప్రసక్తే లేదని కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించిన తరువాత ఆయన ఈ మేరకు వ్యాాఖ్యలు చేశారు. 

దేశంలోని సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లలో రాయితీ ప్రయోజనాలను ఇవ్వ‌డాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డంపై రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంపై మండిప‌డ్డారు. ప్రకటనల కోసం లక్షల కోట్లు వెచ్చిస్తోంద‌ని అలాగే ప్రధాని కొత్త విమానాల కొనుగోలు కోసం, పారిశ్రామిక వేత్తలకు పన్ను మినహాయింపులు ఎన్నో కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని కానీ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రైలు టిక్కెట్లలో రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద రూ.1500 కోట్లు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.  ‘‘ స్నేహితుల కోసం నక్షత్రాలను కూడా తీసుకువస్తాను, కానీ పౌరులను, సీనియర్ సిటిజన్లను పెన్నీల కోసం ఆరాటపడేలా చేస్తున్నారు ’’ అని ఆయన ఆరోపించారు.

జమిలి ఎన్నికలు : పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన

కాగా.. అంతకుముందు రైల్వే టిక్కెట్లలో సీనియర్ సిటిజ‌న్ల‌కు టిక్కెట్లలో రాయితీలను పునఃప్రారంభించే ఉద్దేశ్యం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు రాయితీ రైలు టిక్కెట్లు ‘‘అవాంఛనీయం కాదు’’ అని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల కిందట కోవిడ్-సంబంధిత పరిమితులను కారణంగా పేర్కొంటూ సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లలో రాయితీలు ఇవ్వడాన్ని కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

వీక్లీ మార్కెట్ లో నమాజ్ చేసినందుకు 8 మంది అరెస్టు.. ఉత్త‌రాఖండ్ లో ఘ‌ట‌న

లోక్ సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. రాయితీలు మంజూరు చేయడం వల్ల రైల్వేలు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల సీనియర్ సిటిజన్లతో పాటు అన్ని వర్గాల ప్రయాణీకులకు రాయితీల పరిధిని విస్తరించడం మంచిది కాదు అని తెలిపారు. కాగా రైల్వే శాఖ క్రీడాకారులకు కూడా రాయితీలను నిలిపివేసింది. ఆ రాయితీని కూడా పునరుద్ధరించబోమని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

‘‘ ఇవి (రాయితీల వల్ల వచ్చే ఆర్థిక నష్టాలు) రైల్వేల ఆర్థిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి ’’ అని వైష్ణవ్ చెప్పారు. సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఇవ్వడం వల్ల 2019-20లో రైల్వే శాఖకు రూ.1,667 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. 2019-20లో దాదాపు 22 లక్షల మంది సీనియర్ సిటిజన్లు రైల్వేలో రాయితీ ప్రయాణాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటూ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అనేక తరగతుల రైలు ఛార్జీలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయని, ప్రయాణీకులందరికీ సగటున ప్రయాణ ఖర్చులో 50 శాతం రైల్వే భరిస్తోందని మంత్రి లోక్‌సభకు తెలియజేశారు.

కేరళలో మరో మంకీపాక్స్ కేసు: మూడుకి చేరిన కేసులు

ఇదిలా ఉండగా.. గతంలో  సీనియర్ సిటిజన్లకు రైల్వేల్లో 50 శాతం వరకు రాయితీ ఉండేది. దీనిని మార్చి 2020లో కేంద్రం నిలిపివేసింది. కోవిడ్ -19 వ్యాధి బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటూ సీనియర్ సిటిజన్లను అనవసరమైన ప్రయాణాన్ని రద్దు చేసుకునేలా చేసేందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?