
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఈ కమిటీ అన్ని వర్గాల వివరణలు, అభిప్రాయాలను విననున్నట్టు వివరించాయి. వచ్చే నెల మధ్యలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూనిఫామ్ సివిల్ కోడ్ పై అభిప్రాయాలను తెలియజేయాలని ఇది వరకే లా కమిషన్‌కు నోటీసులు పంపింది. జులై 3వ తేదీన తమ ముందు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్ ప్రతినిధులు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
Also Read: Manipur: మణిపూర్‌లో హైడ్రామా.. సీఎం బిరెన్ సింగ్ రాజీనామా పత్రాన్ని చించేసిన మహిళలు (Video)
వర్షాకాలా పార్లమెంటు సమావేశాలు జులై మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభం అవుతాయి. మధ్యలోనే అవి ఆ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలోకి మారనున్నట్టు ఆ వర్గాలు వివరించాయి.