వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్రం కసరత్తు.. ‘స్టాక్‌ లిమిట్‌ విధించండి’

Published : Oct 25, 2021, 08:39 PM IST
వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్రం కసరత్తు.. ‘స్టాక్‌ లిమిట్‌ విధించండి’

సారాంశం

పండుగ వేళ సాధారణ పౌరులకు వంట నూనెల ధరలు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కృత్రిమ కొరత నివారించే చర్యల్లో భాగంగా రిఫైనరీలు, మిల్లర్లు, ట్రేడర్ల దగ్గర స్టాక్ లిమిట్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాజాగా, ఆ ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారన్న విషయంపై సమీక్ష నిర్వహించింది.  

న్యూఢిల్లీ: పండుగలు వస్తున్నాయంటే చాలు.. వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్నది. దేని డిమాండ్ పెరిగే అవకాశమున్నా బ్లాక్ మార్కెట్ ఆ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటుంది. కృత్రిమ కొరత సృష్టిస్తుంది. రేట్లను రెట్టింపు చేసైనా అమ్మడానికి సిద్ధమవుతుంది. దీంతో ఆబగా Festivals కోసం ఎదురుచూసే సాధారణ ప్రజల ఇక్కట్లు రెండింతలవుతాయి. ముందున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సాధారణ పౌరులకు Cooking Oilsను అందుబాటు ధరల్లోనే ఉంచడానికి నిర్ణయించింది. అందుకే రైఫనరీలు, మిల్లర్లు, ట్రేడర్ల దగ్గర ఎంత వరకు స్టాక్ ఉంచాలి అనే ఓ పరిమితిని విధించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం డ్యూటీ చార్జీలు తగ్గించింది. ఈ తగ్గింపు సాధారణ పౌరులకు అందాలని స్పష్టం చేసింది.

మిల్లర్లు, హోల్ సేలర్లు, రిఫైనరీలు, ఇతర భాగస్వాముల దగ్గర రెండు నెలల స్టోరేజీ కెపాసిటీకి మించి స్టాక్ పోగుపడకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదే వారంలో రాష్ట్రాలకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 8నే ఈ ఆదేశాలు జారీ చేసి 12న, 22న మరోసారి గుర్తుచేసింది. తాజాగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం, ప్రజా పంపిణీ శాఖ(డీఎఫ్‌పీడీ) సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. పండుగ వేళ వంట నూనెలు పౌరులకు సరిపడా స్టాక్, వాటి ధరలూ అందుబాటులో ఉండటానికి కసరత్తు చేస్తున్నది. డీఎఫ్‌పీడీ దీనిపై పర్యవేక్షిస్తున్నది. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నది.

Also Read: సామాన్యులకు తగ్గనున్న వంటింటి భారం.. పండగ ముందు తినదగిన నూనె ధరలు తగ్గింపు..

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆయిల్ డిమాండ్ వేర్వేరుగా ఉంటాయని, అందుకు అనుగుణంగానే Stock Limit విధించాలని డీఎఫ్‌పీడీ ఆదేశించింది. తాజా సమావేశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ లిమిట్‌కు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. ఈ నెల 12వ తేదీనే ఆదేశించామని వివరించింది. రాజస్తాన్, గుజరాత్, హర్యానాలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే స్టాక్ లిమిట్ ఆదేశాలు వెలువడే అవకాశమున్నది. మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, జార్ఖండ్, చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, త్రిపుర, చండీగడ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతిపాదనలు అందాయని, స్టాక్ పరిమితి విధింపు ప్రక్రియ జరుగుతున్నదని ప్రతినిధులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu