విదేశాలకు వెళ్లేందుకు కార్తీ చిదంబరంకు సుప్రీం కోర్టు అనుమతి.. కానీ ఆ కండిషన్ పూర్తిచేశాకే..

By team teluguFirst Published Oct 25, 2021, 5:14 PM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈరోజు(అక్టోబర్ 25) నుంచి నవంబర్ 21 వరకు విదేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పించింది. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈరోజు(అక్టోబర్ 25) నుంచి నవంబర్ 21 వరకు విదేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పించింది. అయితే విదేశాలకు వెళ్లేందుకు ముందు అతడు కోర్టు రిజస్ట్రీ వద్ద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందాడు. ఆ సమయంలో  రూ. 2 కోట్లు డిపాజిట్ చేయమని అడగం జరిగింది. 

మ‌రోవైపు కార్తీ చిదంబరం విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు నివేదించారు. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసినా సరైన రీతలో స్పందించడం లేద‌ని తెలిపారు. కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లకుండా నిషేధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం కార్తీ చిదంబరం.. కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. కార్తీపై ఉన్న ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆ అంశాన్ని వివరంగా పరిష్కరించవచ్చని కోర్టు తెలిపింది. 

ఇక, కార్తీ చిదంబరం ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన క్రిమినల్ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 లో కార్తీ చిదంబరం తండ్రి పి చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్ ద్వారా INX Mediaకు రూ. 305 కోట్ల విదేశీ నిధులను యాక్సెస్ చేయడంలో సహాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన 2017లో కార్తీ చిదంబరంపై ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 

Also read: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు బ్రేక్.. కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు..

ఈ కేసుకు సంబంధించి 2018 మార్చిలో లండన్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకన్న కార్తీ చిదంబరంను కొద్ది నిమిషాల తర్వాత సీబీఐ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం పలు కేసుల్లో ఆయనను విచారించారు. కొద్ది రోజులకు కార్తీ చిదంబరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం తండ్రి పి చిదంబరం 100 రోజులకు పైగా జైలులో గడిపారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. 

click me!