కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం

By narsimha lodeFirst Published Feb 1, 2019, 11:38 AM IST
Highlights

తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన  రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన  రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర్ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ విషయాన్ని  కేంద్రం స్పష్టం చేసింది.  ఐదెకరాలు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేలను చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  శుక్రవారం నాడు లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్‌లో రైతాంగానికి శుభవార్తను అందించారు.  తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం తరహాలోనే కేంద్రం కూడ రైతులకు పెట్టుబడి కోసం  నిధులను అందించనున్నట్టు  ప్రకటించింది. ఎకరానికి రూ.6వేలను పెట్టుబడిగా చెల్లించనుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పెట్టుబడి సహాయాన్ని అందించనంది.

2018 డిసెంబర్ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తామని  పీయూష్ గోయల్ ప్రకటించారు. మూడు విడతల్లో  రైతాంగానికి  సహాయం చేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.దేశంలోని సుమారు 12 కోట్ల మందికి ఈ పథకం ద్వారా  లబ్ది పొందే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్‌ను  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది.

ఏపీ రాష్ట్రం కూడ ఇదే తరహా స్కీమ్‌ను అమలు చేయాలని భావిస్తోంది. తాజాగా కేంద్రం కూడ  ఇదే తరహా స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది.  
 

click me!