ఆదాయపన్ను పరిమితి.. ఉద్యోగులకు భారీ ఊరట

Published : Feb 01, 2019, 11:05 AM IST
ఆదాయపన్ను పరిమితి.. ఉద్యోగులకు భారీ ఊరట

సారాంశం

ముఖ్యంగా మధ్యతరగతి వారిని ఆకర్షించేందుకు ఆదాయపన్నులో పలు మినహాయింపులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మధ్య తరగతి వారికి ఉన్న అసలు సిసలు సమస్య ఏదైనా ఉంది అంటే అది ఆదాయపన్ను. వచ్చే జీతంలో భారీ మొత్తం పన్ను చెల్లింపులకే సరిపోతుంటుంది. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ తో భారీ ఊరట కల్పించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని ఆకర్షించేందుకు ఆదాయపన్నులో పలు మినహాయింపులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

60ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.5లక్షల నంచి రూ.3లక్షలకు పెంచే అవకాశం ఉంది. 60నుంచి 80ఏళ్ల వయసు ఉన్నవారికి మినహాయింపు రూ.3లక్షల నుంచి రూ.3.5లక్షలకు పెంచే అవకాశం ఉంది.

సీనియర్ సిటిజన్లు, మహిళలకు ఇచ్చే మినహాయింపు మరింత పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ ఇన్సూరెన్స్ వడ్డీ పై ఇచ్చే మినహాయింపును కూడా  రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచే అవకాశం ఉంది. పన్ను, శ్లాబులను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?