Har Shikhar Tiranga: ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకం.. రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త ప్రోగ్రామ్

By Mahesh KFirst Published May 26, 2023, 7:12 PM IST
Highlights

కేంద్ర రక్షణ శాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఐఎంఏఎస్ టీమ్ హిమాచల్ ప్రదేశ్‌లోని రియో పర్జైన్ పర్వతాన్ని అధిరోహించారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హర్ ఘర్ తిరంగా తరహాలోనే హర్ శిఖర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీని ప్రకారం, శిఖరాలపై త్రివర్ణ పతాకాలను ఎగరేసి రావడం. తద్వార యువతలో సాహసోపేత క్రీడలు, ఫిట్నెస్, ఆయా రీజియన్‌లలో టూరిజం అవకాశాలపై అవగాహన కలిగించవచ్చని కేంద్రం భావిస్తున్నది.

అరుణాచల్ ప్రదేశ్‌లో దీరంగ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)‌ డైరెక్టర్ కల్నల్ రన్వీర్ సింగ్ జమ్వాల్ సారథ్యంలోని టీమ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ రియో పర్జైల్‌ను అధిరోహించారు. కిన్నరో‌ జిల్లాలోని 6819 మీటర్ల ఎత్తైన ఈ శిఖరాన్ని మే 22వ తేదీన 1450 గంటలకు అధిరోహించారు. 18 గంటల్లో ఈ శిఖరాన్ని అధిరోహించామని ఆ టీమ్ తెలిపింది. 

ఎన్ఐఎంఏఎస్ బృందం విజయవంతంగా పర్వత శిఖరం అధిరోహించిన తర్వాత స్థానిక నోకా ప్రజలు వారిని ఘనంగా స్వాగతించారు. 

హర్ శిఖర్ తిరంగా కార్యక్రమమేంటీ?

ఇది వరకు ఎన్నడూ ప్రయత్నించిన ఒక కొత్త కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ముందు ఆ టీమ్ ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించారు. ఈ టీమ్ ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతాన్ని అధిరోహించింది. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించనున్నారు.

Also Read: ఫ్లైట్ గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసిన ప్యాసింజర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? (Video)

హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ పర్వతాన్ని అధిరోహించడం చాలా అరుదు. 

ఎన్ఐఎంఏఎస్ టీమ్ ట్రెక్కింగ్ వెళ్లేటప్పుడు అన్ని మౌంటెయిన్ ఎక్విప్‌మెంట్లు, రేషన్ ప్యాక్‌లను వెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ టీమ్ ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. అక్కడ కామెట్ పర్వతాన్ని వీరు అధిరోహించన్నారు.

click me!