Exclusive : భారత ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం.. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వీడియో చూశారా..?

By Siva KodatiFirst Published May 26, 2023, 5:15 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియో మీకోసం. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానితో ప్రారంభించడాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తప్పుబట్టాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా వుండాలని 20 పార్టీలు నిర్ణయించాయి. అయితే కేంద్రం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలావుండగా.. కొత్త పార్లమెంట్ భవనం ఎలా వుంటుంది, అందులోని ఏర్పాట్లు ఏంటి, ఎలాంటి సౌకర్యాలు వున్నాయి అన్న వాటికి సంబంధించి వార్తల్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియానెట్ న్యూస్‌ కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన వీడియోను సంపాదించింది. అది మీ కోసం. 

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుక షెడ్యూల్:

>> ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. వేడుక హవనం, పూజతో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగంతో ముగుస్తుంది.

>> మే 28న భారీ వేడుక ఉంటుంది. ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. అంటే.. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర హవనం, పూజలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 

>> ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి.  
 
>> పూజ అనంతరం లోక్ సభ లోపల సెంగోల్ స్థాపన ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య జరుగుతుంది. కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ సీటు పక్కన ఏర్పాటు చేసి గాజు పెట్టెలో ప్రధాని మోదీ చారిత్రాత్మక రాజదండం ఏర్పాటు చేయనున్నారు. 

>> అనంతరం తమిళనాడులోని శైవ మఠాల పూజారులు, చారిత్రాత్మక సెంగోల్ తయారీలో పనిచేసిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్, కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన వారిని సన్మానించనున్నారు.

>> ఉదయం 9.30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పండితులు, సాధువుల ప్రార్థనా సభ జరుగుతుంది.

>> రెండో విడత కార్యక్రమం 

>> మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రారంభమవుతుంది. 

>> ఈ సందర్భంగా రెండు లఘు చిత్రాలను ప్రదర్శించనున్నారు.ఇది మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతుంది. 

>> రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం చేస్తారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి సందేశాలు ఇవ్వనున్నారు.  

>> రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు.

>> లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో స్మారక నాణెం, స్టాంప్‌ను విడుదల చేస్తారు.

>> మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది.

ఉభయ సభల సిట్టింగ్‌ సభ్యులతో పాటు లోక్‌సభ మాజీ స్పీకర్‌, రాజ్యసభ మాజీ చైర్మన్‌లకు కూడా ఆహ్వానాలు పంపినట్లు వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రులందరికీ కూడా ఆహ్వానం అందింది. భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు కూడా ఆహ్వానం పంపబడింది. కొత్త పార్లమెంట్ హౌస్‌కి చీఫ్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాలను కూడా ఆహ్వానించారు. సినీ తారలు, క్రీడాకారులతో పాటు కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు.

BJP నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లోని రాజకీయ పార్టీలు శివసేన (షిండే), నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా జన్-నాయక్ పార్టీ, ఏఐఏడీఎంకే, IMKMK, AJSU, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( RPI), మిజో నేషనల్ ఫ్రంట్, తమిళ్ మనీలా కాంగ్రెస్, ITFT (త్రిపుర), బోడో పీపుల్స్ పార్టీ, పట్టాలి మక్కల్ కట్చి, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, అప్నా దళ్ , అసోమ్ గణ పరిషత్ లు నూతన  పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే NDA యేతర పార్టీలు లోక్ జనశక్తి పార్టీ (పాశ్వాన్), బిజూ జనతాదళ్ (BJD), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), తెలుగుదేశం పార్టీ (TDP), యువజన్ శ్రామిక్ రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), అకాలీదళ్ మరియు జనతాదళ్ సెక్యులర్ (JDS).

 

ప్రారంభోత్సవానికి ముందు కొత్త పార్లమెంట్ భవనం దృశ్యాలు, ఎక్స్‌క్లూజివ్‌గా మీకోసం . pic.twitter.com/w3WCoFQBgY

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!