army chopper crash: కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. కాసేపట్లో పార్లమెంట్‌లో రాజ్‌నాథ్ ప్రకటన

By Siva KodatiFirst Published Dec 8, 2021, 2:48 PM IST
Highlights

తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన (army helicopter crashed) నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ (union cabinet) అత్యవసరంగా సమావేశమైంది.  ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.

తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన (army helicopter crashed) నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ (union cabinet) అత్యవసరంగా సమావేశమైంది.  ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ ప్రమాదంపై ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ (rajnath singh) వివరించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేసే అవకాశముంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సీడీఎస్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్ (madhulika rawat) ప్రాణాలు కోల్పోగా.. ఆయన పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

ALso Read:Army Helicaptor Crash: సిడిఎస్ బిపిన్ రావత్ పరిస్థితి విషమం, భార్య మృతి..?

కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. 


హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న వారి వీరే:

  • జనరల్ బిపిన్ రావత్
  • శ్రీమతి మధులికా రావత్
  • హరీందర్ సింగ్
  • గురు సేవక్ సింగ్
  • జితేంద్ర కుమార్
  • వివేక్ కుమార్
  • సాయి తేజ
  • సత్పత్
click me!