
తమిళనాడులో (tamilnadu) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) (chief of defence staff) జనరల్ బిపిన్ రావత్ (bipin rawat) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సీడీఎస్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్ ప్రాణాలు కోల్పోగా.. ఆయన పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.
కొయంబత్తూర్, కూనూరు మధ్యలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై భారత ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) .. ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) వివరిస్తున్నారు.
హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న వారి వీరే: