2024-2025 ఆర్థిక సంవత్సరం (union budget 2024) కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ప్రకటించారు. అయితే ఈ సారి బడ్జెట్ లో ఆమె కేవలం 57 నిమిషాలే (Nirmala Sitharaman delivers her shortest speech) ప్రసంగించారు.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆరో సారి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తో రికార్డును సమం చేసిన ఆమె.. ఇందులోనే మరో రికార్డును కూడా బ్రేక్ చేశారు. ఈ సారి ఆమె కేవలం 57 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించి 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ 2024 హైలెట్స్ : పన్ను రేట్లు యథాతథం.. పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి లోన్లు..
మరో మూడు నెలల్లో భారత్ లోక్ సభ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను రేట్లలో ఆర్థిక మంత్రి ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే ఎలాంటి ప్రజాకర్షక ప్రకటన చేయలేదు. ప్రసంగంలో 2047 సంవత్సరం నాటికి వికసిత భారత్ పైనే ఆమె దృష్టి సారించారు. అభివృద్ధి మంత్రంపైనే ఫొకస్ పెట్టారు.
జీడీపీకి ఆర్థిక మంత్రి చెప్పిన కొత్త అర్థం ఇదే
కాగా.. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో అతి తక్కువ సమయం ప్రసంగించారు. ఆమె చివరి సారిగా చేసిన అతి తక్కువ ప్రసంగం సమయమే 87 నిమిషాలుగా ఉంది. కానీ దాని కంటే తక్కువగా ఈ మధ్యంతర బడ్జెట్ లో 57 నిమిషాల పాటు మాట్లాడారు. 2020లో రెండు గంటల నలభై నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు.
Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ కథేంటో తెలుసా?
2019 బడ్జెట్ ప్రసంగం రెండు గంటల ఇరవై నిమిషాల పాటు సాగింది. ఆ ఏడాది కేంద్ర బడ్జెట్ ను తొలిసారిగా పూర్తిస్థాయిలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అందులో రాబోయే దశాబ్దానికి 10 సూత్రాల ప్రణాళిక, ఎంఎస్ఎంఈలు, కొత్త వ్యాపారాలకు ప్రయోజనాలు, ఆదాయపు పన్ను రిటర్న్ ప్రీ-ఫైలింగ్ ను ప్రారంభించడం ఆమె ప్రసంగంలో ప్రధానంగా ఉన్నాయి.
గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
2024-2025 ఆర్థిక సంవత్సరం కోసం రూ.47.66 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సానుకూల పరివర్తనను చూసిందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాలు, ఆశావాదంతో భారతీయులు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.