ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి వేగం పెరిగింది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Published : Jul 04, 2023, 05:07 PM IST
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి వేగం పెరిగింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సారాంశం

Gandhinagar: ప్రధాని న‌రేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి వేగం పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ఈ ప్రక్రియలో సహకార సంస్థలు, కార్పొరేట్లు, ఎన్జీవోలు, వ్యక్తులను ప్రధాని మోడీ భాగస్వాములను చేశారని తెలిపారు.   

Union Home Minister Amit Shah: గత తొమ్మిదేళ్లలో దేశాభివృద్ధి వేగం పెరిగిందనీ, ఈ ప్రక్రియలో సహకార సంస్థలు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను భాగస్వాములను చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీంతో దేశ వృద్ది మ‌రింత‌గా ప‌రుగులు పెడుతోంద‌ని చెప్పారు. ఉత్తర గుజరాత్ లోని మెహ్సానాలో ప్రభుత్వ,  ప్ర‌యివేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయనున్న సైనిక్ స్కూల్ కు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో అమిత్ షా వర్చువల్ గా ప్రసంగించారు. మెహ్సానా జిల్లాలోని బోరియావి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సైనిక్ స్కూల్ పీపీపీ విధానంలో 100 పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న కేంద్రం చొరవలో భాగంగా ఇది జ‌రుగుతోంది.

ఈ త‌ర‌హాలోనే 100 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారనీ, పీపీపీ మోడల్ కింద మెహ్సానాలో ఏర్పాటు చేస్తున్న మోతీభాయ్ చౌదరి సాగర్ సైనిక్ పాఠశాల విద్యార్థులకు సాయుధ దళాల్లో ప్రవేశించడానికి సరళమైన-సులభమైన మార్గాన్ని అందించే 20 వ పాఠశాల అవుతుందని షా చెప్పారు. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి వేగం మందగించిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ భద్రత, అభివృద్ధి కోసం పాటుపడటమే కాకుండా, పెద్ద సంఖ్యలో సహకార సంస్థలు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేశారు. ఇది అభివృద్ధి ప్రక్రియలో దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది : కేంద్ర హోం అమిత్ షా

సైనిక్ స్కూల్ విద్యార్థులు తమ కృషితో భరతమాతకు సేవ చేయడానికి సిద్ధం చేస్తుందని అమిత్ షా చెప్పారు. భద్రత, దేశభక్తి, ధైర్యసాహసాల గురించి విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ కొత్త పాఠశాల దోహదపడుతుందన్నారు. కొత్త పాఠశాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దూద్సాగర్ డెయిరీ పాల సహకార సంస్థను, దాని చైర్మన్ అశోక్ చౌదరిని, మొత్తం బోర్డును కేంద్ర మంత్రి అభినందించారు. భూగర్భ జల మట్టం క్షీణించడం వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఉత్తర గుజరాత్ లో నీటి కొరతను తొలగించడానికి ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని అమిత్ షా చెప్పారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ నర్మదా, మహిసాగర్ నదీ జలాలను ఉత్తర గుజరాత్ కు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇది భూగర్భజల మట్టాన్ని పెంచడానికి సహాయపడిందని ఆయన అన్నారు.

వ్యవసాయంతో పాటు ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తికి కూడా ఇది దోహదపడిందని తెలిపారు. ఉత్తర గుజరాత్ జిల్లాల్లో సహకార పాల ఉత్పత్తిని బలోపేతం చేయడానికి మాజీ ఎమ్మెల్యే మోతీభాయ్ చౌదరి చేసిన కృషిని అమిత్ షా ప్రశంసించారు. గేదె పాల సేకరణ ధరను పెంచడం, తేనె, సేంద్రియ వ్యవసాయం కోసం చొరవ తీసుకోవడం, పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా దూద్సాగర్ డెయిరీ పశువుల రైతులకు రూ.375 కోట్ల విలువైన ప్రయోజనాలను అందించిందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం