లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై బీజేపీ ఫోక‌స్.. కాషాయ పార్టీకి కొత్త సార‌థులు

Published : Jul 04, 2023, 04:43 PM IST
లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై బీజేపీ ఫోక‌స్.. కాషాయ పార్టీకి కొత్త సార‌థులు

సారాంశం

New Delhi: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. రాష్ట్రస్థాయిలో నాయకత్వాన్ని మార్చి కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తీసుకురావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనీ, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా మారుస్తారని గత వారం రోజులుగా వార్తలు వచ్చాయి.  

BJP appoints party unit chiefs of 4 states: 2024 లో కీలకమైన లోక్ స‌భ‌ ఎన్నికలకు ముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్ నాలుగు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను పునర్వ్యవస్థీకరించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జీ.కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా డీ.పురంధేశ్వరిని పార్టీ నియమించింది. కిషన్ రెడ్డి ప్రస్తుతం పర్యాటక, సాంస్కృతిక, అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం బాబూలాల్ మరాండీని, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ జాఖర్ ను బీజేపీ నియమించింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న జాఖర్ 2022 మేలో పార్టీని వీడి బీజేపీలో చేరారు.

తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈటల రాజేందర్ 2021 జూన్ లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములను ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు కబ్జా చేశాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో అదే ఏడాది మేలో ఈటల రాజేందర్ ను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించారు. రాష్ట్రస్థాయిలో నాయకత్వాన్ని మార్చి కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తీసుకురావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనీ, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా మారుస్తారని గత వారం రోజులుగా వార్తలు వచ్చాయి.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !