ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య, అరెస్ట్..

Published : Mar 16, 2023, 01:58 PM ISTUpdated : Mar 16, 2023, 02:07 PM IST
ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య, అరెస్ట్..

సారాంశం

తన కూతురిని స్కూల్ టీచర్ వేధించాడని, పరీక్షలో కాపీ కొట్టిందని తప్పుడు ఆరోపణలు చేశారని పాఠశాల విద్యార్థిని తండ్రి ఆరోపించారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో  ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్నోలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని చనిపోయింది. అయితే, ఆమె దగ్గర సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని పోలీసులు బుధవారం తెలిపారు. 

తన కూతురిని స్కూల్ టీచర్ వేధించాడని, పరీక్షల్లో కాపీ కొట్టిందని తప్పుడు కేసులు పెట్టాడని విద్యార్థిని తండ్రి ఆరోపించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

అంతకుముందు మార్చి 4న, బరేలీ జిల్లాలో ఫీజు చెల్లించలేదని, పరీక్షకు హాజరు కానివ్వకపోవడంతో ప్రైవేట్ పాఠశాల నిరాకరించడంతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని బరేలీ ఎస్పీ (నగరం) రాహుల్ భాటి తెలిపారు. 

పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, బాలిక తండ్రి అశోక్ గంగ్వార్ ఆరోపిస్తూ, "నా కూతురు 9వ తరగతి చదువుతోంది, కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా, మేం తన పాఠశాల ఫీజులను సకాలంలో చెల్లించలేకపోయాం, పరీక్షలకు అనుమతించమని మేము పాఠశాల యాజమాన్యాన్ని అభ్యర్థించాం. ఆమె పరీక్షకు వెళ్లింది. కానీ, వారు ఆమెను అనుమతించలేదు. ఫీజు సుమారు రూ. 20,000-25,000. ఆమె డాక్టర్ కావాలనుకుంది" అని తండ్రి చెప్పుకొచ్చారు. 

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే అత్యధికం..!

ఇదిలా ఉండగా, ఉన్నత చదువులు చదువుకుని కూడా ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగంలో చేరిన ఓ మహిళకి ఆమె అందమే ఆమె పాలిట శాపంగా మారింది. కామాంధుడైన ఉన్నతాధికారి వేధింపులతో  బలవన్మరణానికి పాల్పడింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరి తన చదువుకు కాస్తయినా సార్ధకత సాధిద్దామని అనుకున్న ఆమెకి కామాంధుని వేధింపులు మృత్యుపాశంలా తయారయ్యాయి.  సెస్కాంలో ఉన్నతాధికారి వేధింపులను తట్టుకోలేక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పురుగుల మందు తాగి బలవన్మరణం  చెందింది.

మంగళవారం నాడు ఈ ఘటన కొడగు జిల్లా మడికేరి వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. మడికేరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ మడికేరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధుల్లో చేరారు.  సెస్కాంలో సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న పవన్ అనే వ్యక్తి ఆమె మీద కన్నేశాడు. దీంతో ఆమెపై వేధింపులకు తెరతీశాడు.

తనకు ఫోన్ చేయాలంటూ..  తనతో వాట్సాప్ లో చాటింగ్ చేయాలి అంటూ సౌమ్యను తరచుగా వేధించేవాడు. ఈ మేరకు సౌమ్య భర్త..  రిటైర్డ్ జవాన్ పోలీసులకు తెలిపారు. ఎన్నిసార్లు సౌమ్య దీనికి నిరాకరించినా వినయ్ వేధింపులు ఆగలేదు. అతను తన వేధింపులను అలాగే కొనసాగిస్తుండడంతో సౌమ్య విరక్తి చెందింది. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె భర్త  మడికేరి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏఈఈ వినయ్ మీద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu