లంచం, బెదిరింపు ఆరోప‌ణ‌ల‌తో డిజైన‌ర్ పై కేసు పెట్టిన అమృతా ఫ‌డ్న‌వీస్

Published : Mar 16, 2023, 01:17 PM IST
లంచం, బెదిరింపు ఆరోప‌ణ‌ల‌తో డిజైన‌ర్ పై కేసు పెట్టిన అమృతా ఫ‌డ్న‌వీస్

సారాంశం

Mumbai: అమృత ఫ‌డ్న‌వీస్ ఒక డిజైన‌ర్ పై పోలీసుల‌కు పిర్యాదు చేశారు. ఆ మ‌హిళా డిజైన‌ర్ త‌న‌కు లంచం ఇవ్వ‌డినికి ప్ర‌య‌త్నించ‌డంతో పాటు బెదిరింపుల‌కు గురిచేసిందని అమృత త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.   

Amruta Fadnavis has filed case against a designer: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఓ డిజైనర్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ మ‌హిళా డిజైన‌ర్ త‌న‌కు లంచం ఇవ్వ‌డినికి ప్ర‌య‌త్నించ‌డంతో పాటు బెదిరింపుల‌కు గురిచేసిందని అమృత త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఒక‌ క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి త‌న‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారనీ, అలాగే తనను బెదిరించారని ఒక మ‌హిళా డిజైన‌ర్ పై అమృతా ఫ‌డ్న‌వీస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అమృత ఫిర్యాదులోని వివ‌రాల ప్ర‌కారం.. మ‌హిళా డిజైన‌ర్ అనిక్ష‌, ఆమె తండ్రిని నిందితులుగా పేర్కొన్నారు. మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 20న అనిక్ష, ఆమె తండ్రిగా గుర్తించిన ఒక వ్య‌క్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్ల‌డించారు. 

ఎఫ్ఐఆర్ ప్రకారం, అనిక్ష గత 16 నెలలుగా అమృతతో టచ్ ఉన్నారు. అలాగే, ఆమె నివాసానికి కూడా ప‌లుమార్లు వెళ్లింది. 2021 నవంబర్ లో అనిక్షను తొలిసారి కలిశానని అమృత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనిక్ష తాను దుస్తులు, ఆభరణాలు, పాదరక్షల డిజైనర్ న‌నీ, వాటిని బహిరంగ కార్యక్రమాల్లో ధరించాలని డిప్యూటీ సీఎం సతీమణిని కోరినట్లు మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అలాగే, త‌న‌కు తల్లి లేర‌నీ, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు తాను చూసుకుంటున్నానని అనిక్ష అమృతకు చెప్పినట్లు వెల్ల‌డించారు. 

ఈ క్ర‌మంలోనే అమృత నమ్మకాన్ని చూరగొన్న తర్వాత.. త‌న తండ్రి ఒక క్రిమిన‌ల్ కేసులో ఇరుక్కున్నార‌నీ, ఆయ‌నను ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌టానికి సాయం చేయాల‌ని కోరింది. దీని కోసం డిజైన‌ర్ కోటి రూపాయ‌లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు అమృత త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు అనిక్ష తనకు కొందరు బుకీల గురించి సమాచారం ఇస్తానని చెప్పిందనీ,  వారి నుంచి డబ్బు సంపాదించవచ్చని పేర్కొంది. అనిక్ష ప్రవర్తనలో మార్పును తెలుసుకున్న అమృత ఫ‌డ్న‌వీస్ స‌ద‌రు మ‌హిళ ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసిన‌ట్టు పోలీసులకు తెలిపింది.

అయితే, గుర్తుతెలియని నంబర్ నుంచి అమృతకు వీడియో క్లిప్స్, వాయిస్ నోట్స్, పలు సందేశాలు పంపినట్లు సమాచారం.  ఈ క్ర‌మంలోనే డిజైన‌ర్ అనిక్ష‌, ఆమె తండ్రి పరోక్షంగా అమృతను బెదిరించి కుట్ర పన్నారనీ, ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్ ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. ప్రభుత్వోద్యోగిని ప్రలోభపెట్టడానికి అవినీతి, చట్టవిరుద్ధ మార్గాలను ఉపయోగించినందుకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 120-బీ (కుట్ర), అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద నగర పోలీసులు అనిక్ష, ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu