Ukraine Russia Crisis కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న మోడీ

Published : Feb 28, 2022, 07:11 PM ISTUpdated : Feb 28, 2022, 07:22 PM IST
Ukraine Russia Crisis కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న మోడీ

సారాంశం

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు మరోసారి  ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి Narendra Modi  సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. Ukraine నుండి భారతీయుల తరలింపుతో పాటు ఇతర అంశాలపై High level meetingలో ప్రధాని మోడీ చర్చించనున్నారు.

ఉక్రెయిన్  నుండి భారతీయుల తరలింపుపై ఆదివారం నాడు కూడా ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. సోమవారం నాడు ఉదయం కూడా రెండు దఫాలు సమావేశమయ్యారు. సోమవారం నాడు సాయంత్రం కూడా మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును మ‌రింత వేగ‌వంతం చేసేలా.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డానికి ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు ప‌లువురు కేంద్ర మంత్రులు వెళ్ల‌నున్నారు.  కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిర‌ణ్‌ రిజిజు, జ‌నరల్ వీకే సింగ్‌లను ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపాలని కేంద్రం ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

కేంద్ర మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు సైతం వారివెంట వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ Jai shankar, విదేశాంగ కార్యదర్శి హరీష్ ష్రింగ్లా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లు హాజ‌ర‌య్యారు. వీలైనంత త్వ‌ర‌గా కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు వెళ్లనున్నార‌ని అధికారులు చెప్పారు. 

ఇప్ప‌టికే ప‌లువురిని కేంద్ర ప్ర‌భుత్వం ఇండియాకు తీసుకువ‌చ్చిన ఇంకా చాలా మంది అక్క‌డే చిక్కుకుపోయారు. ఈ నేప‌థ్యంలో భార‌త‌ విద్యార్థులను సరిహద్దు దాటేందుకు భద్రతా బలగాలు అనుమతించకపోవడంతో ఆదివారం పోలాండ్, రొమేనియా సరిహద్దుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 


రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా దాదాపు 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.116 మంది చిన్నారులు సహా మరో 1,684 మంది గాయపడ్డారని తెలిపింది.  ర‌ష్యా తన దళాలు ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ పౌర జనాభా ప్రమాదంలో నెట్టే చ‌ర్య‌లు చేయ‌డం లేద‌ని వెల్ల‌డించింది. ఇరు దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న ఈ యుద్ధం ఎంత‌మంది సైనికులు చ‌నిపోయార‌నే విష‌యాన్ని ర‌ష్యా వెల్ల‌డించ‌లేదు. 

అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి గత ఐదు రోజుల్లో వ్లాదిమిర్ పుతిన్ బలగాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఎంత మంది చ‌నిపోయార‌నే సంఖ్య‌ను ప్ర‌స్తావించ‌లేదు. యుద్ధంలో 5,300 మంది రష్యన్ ఆర్మీ సిబ్బంది మరణించారని ఉక్రెయిన్  పేర్కొంది. ఇదిలావుండ‌గా, ర‌ష్యా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున్న ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ వైపు వ‌స్తున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. Kvivకు ఉత్తరాన 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో భారీ గా బ‌ల‌గాలు ఉన్నాయ‌ని చెబుతున్నాయి. 

ఇవాళ మధ్యాహ్నం రష్యా ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు ప్రారంభమయ్యాయి.ఈ చర్చల్లో రెండు దేశాలు తమ వాదనలను విన్పిస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే డిమాండ్ ను రష్యా పెడుతుంది. అయితే కాల్పుల విరమణపై ఉక్రెయిన్ పట్టుబడుతుంది. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?