ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి - జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ

By team teluguFirst Published Nov 15, 2022, 11:05 AM IST
Highlights

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యమార్గంలో పరిష్కరించుకోవాలని మరో సారి పిలుపునిచ్చారు. 

ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఇంధన సరఫరాపై కూడా ఎలాంటి ఆంక్షలను ప్రోత్సహించకూడదని తెలిపారు. ఇండోనేషియా రాజధాని బాలిలో జీ 20 శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని నిన్న ఇండియా నుంచి బయలుదేరి బాలికి చేరుకున్నారు. మంగళవారం నిర్వహిస్తున్న సమావేశానికి మోడీ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. 

వాతావరణ మార్పు, కోవిడ్ -19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో పరిణామాలు, దానితో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్యలు, ప్రపంచ సరఫరా గొలుసులు శిథిలావస్థలో ఉన్నాయని, అవి ప్రపంచంలో వినాశనానికి కారణమయ్యాయని అన్నారు. ఉక్రెయిన్‌పై మాస్కో దాడిని దృష్టిలో ఉంచుకుని రష్యా చమురు, గ్యాస్ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

13 యేళ్ల చిన్నారిని ఇంటినుంచి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం.. ఆ తరువాత అమానుషంగా..

‘‘ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అందువల్ల ప్రపంచ వృద్ధికి భారతదేశం ఇంధన-భద్రత కూడా చాలా ముఖ్యమైనది. ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలను మనం ప్రోత్సహించకూడదు. ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని నిర్ధారించాలి’’ అని సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. 

స్వచ్ఛమైన శక్తి , పర్యావరణానికి భారతదేశం కట్టుబడి ఉందని అన్నారు. ‘‘ 2030 నాటికి మన విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, సరసమైన ఫైనాన్స్ అత్యావశ్యకం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సంక్షోభం ఉందని, ప్రతీ దేశంలోని పేద పౌరులకు దీని సవాలు తీవ్రంగా ఉందని చెప్పారు. దైనందిన జీవితం వారికి ఓ పోరాటంగా ఉందని తెలిపారు.

బలవంతపు మత మార్పిడి ప్రమాదకరం - సుప్రీంకోర్టు

‘‘డబుల్ వామ్మీ’’తో వ్యవహరించే ఆర్థిక సామర్థ్యం పేదలకు లేదని ప్రధాన మంత్రి అన్నారు ఐక్యరాజ్యసమితి వంటి బహుపాక్షిక సంస్థలు ఈ విషయంలో విఫలమయ్యాయని అంగీకరించడానికి మనం వెనుకాడకూడదని చెప్పారు. ‘‘ మనమందరం వాటిలో తగిన సంస్కరణలు చేయడంలో విఫలమయ్యాము. అందువల్ల ప్రపంచం నేటి జీ -20 ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. మన గ్రూప్ మరింత ముఖ్యమైనదిగా మారింది ’’ అని ఆయన అన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేసిందని , అందుకే ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ, దౌత్య మార్గంలోకి తిరిగి రావాలని తాను పదే పదే కోరానని చెప్పారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం, భద్రతను నిర్ధారించడానికి దృఢమైన, సమిష్టి సంకల్పం చూపించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీలు నడిచిన పవిత్ర భూమిలో జీ-20 సమావేశం జరుగుతుందని, అప్పుడు మనమంతా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందిస్తామని జీ 20 శిఖరాగ్ర సమావేశ నాయకులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. 
తెలిపారు.

భారత తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ వాయిదా.. ఎందుకంటే ?

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మన దేశంలో జీ 20 శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలుగా ఉన్నాయి. 

click me!