13 యేళ్ల చిన్నారిని ఇంటినుంచి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం.. ఆ తరువాత అమానుషంగా..

Published : Nov 15, 2022, 10:19 AM IST
13 యేళ్ల చిన్నారిని ఇంటినుంచి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం.. ఆ తరువాత అమానుషంగా..

సారాంశం

బీహార్ లో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 13యేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ప్రైవేట్ పార్ట్స్ ను, నాలుకను కోసి వెళ్లారు. 

బీహార్ : కామాంధులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచారం చేసి వదిలేసి వెళ్లకుండా.. అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. అలా కాకుండా మరికొందరు.. బాధితురాలిని తీవ్రంగా హింసించి, శరీర భాగాలను అత్యంత పాశవికంగా కోసి తమలోని రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. అలాంటి ఓ ఒళ్లు గగుర్పొడిచే ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 

బీహార్ లోని పట్నాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సమస్తిపుర్ లోని కళ్యాణ్ పుర్ కు చెందిన 13యేళ్ల బాలికను కొందరు కామాంధులు ఈ నెల 11న ఇంటినుంచి ఎత్తుకుపోయారు. సమీపంలోని తోటలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కూడా ఆమెను వదలకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. 

ప్రైవేటు భాగాలను, నాలుకను కోసేసి అక్కడినుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ చిన్నారిని స్థానికులు గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేదవారైన బాలిక తల్లింద్రుడులు విరాళాలు సేకరించి బాలికకు వైద్యం చేయిస్తున్నారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

దారుణం.. బర్త్ డే వేడుకల్లో యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం..

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 12న ఇలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. స్కూల్లో తనతోపాటు చదువుకున్న విద్యార్థినిని.. రెండేళ్ల తర్వాత ప్రేమ పేరుతో వేధించి.. ఆమెను భయపెట్టి తాళి కట్టి.. పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఈ ఘాతుకం అనంతపురం నగరంలో తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన తన క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి ప్రేమించకపోతే తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించేవాడు. భయపడిన ఆమె అతనితో మాట్లాడేది. 

దీన్ని అదునుగా తీసుకుని ఈ ఏడాది జూన్లో అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. ‘ఇక నుంచి  నువ్వు నా భార్యవు’ అంటూ బ్లాక్ మెయిల్ చేసి,  అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్నప్పుడు తాళి దాచి పెట్టుకుని ఉండేది. కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న ఆమె ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పుడు కూడా ఆమెను అతను వదల్లేదు. సెలవుల తర్వాత కళాశాల విద్యార్థిని వెంటపడి అక్కడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది భరించలేని బాధితురాలు ఇటీవల తల్లికి విషయం చేసింది. దీంతో ఆమె అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted