ఎవరు ఆ విజయ్ మామా..? వైరల్ అవుతున్న రిషి సునక్ వీడియో...!

Published : Oct 29, 2022, 09:41 AM IST
 ఎవరు ఆ విజయ్ మామా..? వైరల్ అవుతున్న రిషి సునక్ వీడియో...!

సారాంశం

 రిషి సునక్ కి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటిట వైరల్ గా మారింది.

రిషి సునక్... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. భారత సంతతి వ్యక్తి.... బ్రిటన్ కి ప్రధాని కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రిషి సునక్ ప్రధాని కావడం పట్ల... అక్కడి వారి సంగతి తెలీదు కానీ... భారతీయులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. దీంతో... రిషి సునక్ కి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటిట వైరల్ గా మారింది. అందులో ఆయన ఎవరినో ఉద్దేశించి విజయ్ మామా అంటూ ప్రస్తావించారు. దీంతో...ఇంతకీ ఎవరు ఆ విజయ్ మామా అంటూ నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రముఖ చెఫ్ సంజయ్ రైనా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో సంజయ్ రైనాతో పాటు... రిషి సునక్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి విజయ్ మామా అంటూ సంభోధించి మాట్లాడారు. అంతేకాదు త్వరలోనే యూకే రావాలంటూ ఆహ్వానించాడు కూడా. దీంతో... ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

కొందరు ఈ వీడియో చూసి.... విదేశాల్లో పెరిగినా రిషి సునక్.. ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడోనని.. దేశీయ మూలాలు అస్సలు వదులుకోలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొందరు మాత్రం.. అది బంధువుతో మాట్లాడిన వీడియో కాదని.. ఎవరిమీదో సెటైరికల్ గా మాట్లాడిన వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మామ అంటే కొంపదీసి విజయ్ మాల్యా కాదు కదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. ఏది ఏమైనా ప్రస్తుతం విజయ్ సునక్ కి చెందిన ప్రతి వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోకి ప్రస్తుతం లక్షల్లో వ్యూస్ వస్తుండటం విశేషం.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu