
శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినా నేటీకి మూఢనమ్మకాలను నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. గ్రామీణా ప్రాంతాల్లో ఈ మూఢ నమ్మాకాలను ఎక్కువగా నమ్ముతారు. ఇదే కోవలో జంతుబలి అనేది మనదేశంలోని అనేక వర్గాలలో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న ఒక మూఢ ఆచారం. ఆచారబద్ధంగా జంతువును లేదా పక్షిని బలి ఇస్తారు. అలా చేయడం వల్ల అదృష్టం వస్తుందనీ కొందరు నమ్ముతారు ,
మరికొందరు దుష్ట శక్తులు వెళ్లిపోతాయని నమ్ముతారు. కాగా.. తమిళనాడులో అలాంటి ఆచారం నిర్వహిస్తుండగా (జంతుబలి) ఘోరం జరిగింది. జంతుబలి కర్మ నిర్వహించే వ్యక్తి చంపబడ్డాడు.వధించాల్సిన కోడి ఎలాంటి గాయపడకుండా బయటపడింది. ఈ ఘటన కొద్దీగా మిస్టరీగా మారింది. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అసలు విషయమేంటో తెలుసుకుందాం...
పల్లవరంలోని పొజిచలూరులో నివసిస్తున్న రాజేంద్రన్(70) తాపీ మేస్త్రీ. తాపీ మేస్త్రీగా పనిచేసే రాజేంద్రన్ గృహప్రవేశాల సమయంలో జంతుబలులు కూడా చేసేవాడు. ఈ క్రమంలో టీ. లోకేష్ అనే వ్యక్తి తాను కొత్తగా నిర్మించిన మూడంతస్తుల బిల్డింగ్ లో గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించే ముందు జంతుబలి చేయాలని రాజేంద్రన్ ఆహ్వానించారు. దీంతో రాజేంద్రన్ గురువారం తెల్లవారుజామున కోడిని తీసుకుని భవనం పైకి వెళ్లి పూజలు చేశారు.
అయితే.. బిల్డింగ్ పైకి వెళ్లిన రాజేంద్రన్ ఎంతసేపటికి తిరిగి రాకపోయే సరికి అనుమానంతో లోకేష్ తన ఇంటి ఆవరణలో వెతికి చూసాడు. కానీ కనిపించలేదు. తీరా చూసే సరికి..లిఫ్ట్ కోసం తవ్విన 20 అడుగుల లోతు గుంతలో పడి ఉన్నాడు. బలి ఇవ్వాల్సిన కోడి భవనంపై నుండి పడిపోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రన్ పూజ నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ చీకట్లో అదుపు తప్పి .. లిప్టు గుంతలో పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఖననం చేయబడిన శవం నుంచి తల మిస్సింగ్
చిత్రవాడిలోని శ్మశానవాటికలో పాతిపెట్టిన పదేళ్ల బాలిక శరీరం నుండి తలను వేరు చేయడంతో అనుమానితులపై కేసు బయటపడింది. కృతిక అనే బాలిక అక్టోబరు 14న ఆమెపై విద్యుత్ స్తంభం పడి చనిపోయి, మరుసటి రోజు చిత్రవాడి శ్మశానవాటికలో ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. రెండు రోజుల క్రితం కృతికను పాతిపెట్టిన స్థలం తవ్వినట్టు స్థానికులు గమనించారు.
తదుపరి తనిఖీలో ఆమె సమాధి దగ్గర నిమ్మకాయలు, పువ్వులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో సమాధి దగ్గర అనుమానాస్పద కార్యకలాపాలు జరిగి ఉండొచ్చని కృతిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సమాధిని తవ్వి మృతదేహం వెలికి తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక శవం నుంచి తలను తొలగించినట్టు గుర్తించారు. మంత్రవిద్య చేస్తున్న కొందరు వ్యక్తులు ఆ బాలిక తలని వేరు చేసి ఉంటారని తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.