G20 Summit: యూకే పీఎం రిషి సునాక్‌కు టై సర్దుతున్న అక్షతా మూర్తి ఫొటో వైరల్

By Mahesh K  |  First Published Sep 9, 2023, 3:22 PM IST

యూకే పీఎం రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సునాక్ మెడలో టై ఆమె సర్దుతూ ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. జీ 20 సదస్సు కోసం వారిద్దరూ ఢిల్లీకి రావడానికి కొన్ని క్షణాల ముందు భర్త టైని జాగ్రత్తగా చూస్తున్న భార్య అక్షతామూర్తి చిత్రంపై చాలా మంది ప్రశంసలు కురిపించారు.
 


న్యూఢిల్లీ: యునైటెండ్ కింగ్‌డం ప్రధానమంత్రి రిషి సునాక్‌ సతి అక్షతామూర్తి సమేతంగా శుక్రవారం భారత్‌కు విచ్చేశారు. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. వారిద్దరినీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతించారు.

రిషి సునాక్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. అది ప్రజలను ఆకర్షించింది. ఆ దంపతుల గాఢమైన బంధం గురించి చర్చకు దారి తీసింది. ఆ చిత్రంలో రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి ఉన్నారు. వారు ఇండియాకు రావడానికి ముందు రోటీన్‌లో మునిగి ఉన్నారు. వారు పాలం ఎయిర్‌పోర్టుకు రావడానికి ముందు అక్షతా మూర్తి భర్త సునాక్‌ మెడలో టైని జాగ్రత్తగా సర్దుతున్నారు. ఆ చిత్రమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంతర్జాతీయంగా పేరొందిన ఈ జంట వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Just ❤️ pic.twitter.com/Eb4uEXVcZo

— पवन सिंह बैश | Pawan Singh Baish (@pawansbaish)

Latest Videos

Also Read: G20 Summit: ఉత్తర కొరియాతో అన్నింటా దగ్గరి సంబంధాలు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె. అక్షతా ఫ్యాషన్ డిజైనర్. కాటమారన్ వెంచర్స్ డైరెక్టర్. సునాక్, అక్షతాలు చాలా సింపుల్‌గా మసులుకోవడాన్ని చూపిస్తున్న ఆ చిత్రంపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. అక్షతా మూర్తి ప్రిస్టిన్ వైట్ షర్ట్, ఫుల్ లెంత్ స్కర్ట్ ధరించి ఉన్నారు. ఆమె స్కర్ట్‌తో మ్యాచ్ అయ్యే ఆరెంజ్ టైని రిషి సునాక్‌కు కడుతూ ఆ చిత్రంలో కనిపించింది.

click me!