UGC India Twitter Hacked: మ‌రో ప్ర‌భుత్వ సంస్థ‌ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్.. రెండు రోజుల్లో మూడోవ‌ది..

Published : Apr 11, 2022, 05:20 AM IST
UGC India Twitter Hacked: మ‌రో ప్ర‌భుత్వ సంస్థ‌ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్.. రెండు రోజుల్లో మూడోవ‌ది..

సారాంశం

UGC India Twitter Hacked: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఇండియా అధికారిక‌ ట్విటర్‌ అకౌంట్‌పై ఆదివారం హ్యాకర్లు దాడి చేశారు. హ్యాకింగ్‌ అనంతరం అనేక ట్వీట్‌లు చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తులకు ట్యాగ్‌ చేశారు. యూజీసీ ప్రొఫైల్‌ ఫొటో స్థానంలో ఒక కార్టూన్‌ బొమ్మ పెట్టారు. అయితే ప్రస్తుతం ప్రొఫైల్‌ ఫొటో స్థానంలో ఏమీలేదని యూజీసీ పేర్కొంది.     

UGC India Twitter Hacked: ఇటీవ‌ల ప్రభుత్వ ప్ర‌తినిధులు, కీలక వ్యక్తుల  ఖాతాలు తరచూ హ్యాకింగ్ కు గురవుతుండ‌టం వింటున్నాం. గతేడాది డిసెంబర్ లో ఏకంగా.. ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఆ త‌రువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేత‌ల, సంస్థ‌ల‌ ట్విట్టర్ ఖాతాలపై హ్యాక‌ర్లు దాడి  చేసిన విష‌యం తెలిసిందే.. 

ఇటీవ‌లి కాలంలో ఈ దాడులు మ‌రింత తీవ్రమ‌య్యాయి.  తాజాగా,  యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఇండియా ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైంది.  యుజిసి - ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాక్ చేయబడింది. కొంతమంది గుర్తుతెలియని హ్యాకర్లు UGC అధికార‌ ట్విట్టర్ ఖాతాను నియంత్రించి, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తెలియని వ్యక్తులను ట్యాగ్ చేస్తూ అసంబద్ధమైన ట్వీట్‌లను పోస్ట్ చేయడంతో హ్యాక్ చేయ‌బ‌డిన‌ట్టు అధికారులు గుర్తించారు. హ్యాకర్ ప్రొఫైల్ ఫోటో తొలిగించి..ఓ కార్టూనిస్ట్ చిత్రాన్ని ప్రోఫైల్ పిక్ గా సెలెక్ట‌ర్ చేశారు.

@ugc_india అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్‌కు ప్రస్తుతం 2,96,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఖాతా దాని అధికారిక వెబ్‌సైట్‌కి కూడా లింక్ చేయబడింది. గ‌త రెండు రోజుల్లో హ్యాకింగ్‌కు గురైన మూడవ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా ఇది. గత రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, భారత వాతావరణ శాఖకు చెందిన ట్విట్టర్ ఖాతాలు కూడా ఇలాగే హ్యాక్ అయ్యాయి.

ఇదిలా ఉండగా, లక్నోలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయంలోని నిపుణుల బృందం దీనిపై విచారణ చేపట్టనుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసును సైబర్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా