
Smriti Irani: ఇంధన ధరల పెరుగుదల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిరసన సెగ తగిలింది. ఆమె ఢిల్లీ - గౌహతి కి విమానంలో ప్రయాణించే క్రమంలో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ మహిళా విభాగం తాత్కాలిక చీఫ్ నెట్టా డిసౌజా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నిలాదీశారు. వీరిద్దరి మధ్య జరిగిన వివాదాన్ని మంత్రి స్మృతి తన ఫోన్‌లో రికార్డు చేశారు. దీంతో నెట్టా డిసౌజా కూడా తన ఫోన్‌లో రికార్డు చేశారు. ఇంతటితో కాంగ్రెస్ మహిళా నేత ఆగకుండా.. తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘గౌహతి వెళ్తున్న సమయంలో మోదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కలిశారు. పెట్రో ధరల పెంపు పై ప్రశ్నించాను. దీంతో వ్యాక్సిన్లు, రేషన్‌తో సహా పేదలను నిందించారు. ఈ వీడియోను చూడండి’’ అంటూ కాంగ్రెస్ నేత డిసౌజా ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్టును మంత్రికి ట్యాగ్ చేసింది. అయితే విమానం దిగుతుండగా ఈ మాటల యుద్ధం సాగింది. అయితే.. పోరాకుండా కాంగ్రెస్ మధ్యలో నిల్చున్నారని ఇరానీ ఆరోపించారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు గురించి ప్రస్తావించగా.. అదంతా తప్పే అంటూ స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. దయచేసి అబద్ధాలు ఆడకండి అంటూ కేంద్ర మంత్రి అన్నారని కాంగ్రెస్ నేత డిసౌజా చెప్పుకొచ్చారు.
ఇరానీ స్పందిస్తూ ‘కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నది. 183 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు కూడా ఉచితంగా పంపిణీ చేశాం’ అని విచిత్రమైన వాదన చేశారు. ఆమె సమాధానాన్ని వీడియో తీసిన నెట్టా డిసౌజా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ధరలు పెరగడం వల్ల ‘గ్యాస్ లేని స్టవ్స్’ ఇండ్లలో ఉన్నాయని డిసౌజా ప్రశ్నించగా, ‘అబద్ధాలు చెప్పకండి’ అంటూ కేంద్ర మంత్రి అనడం అందులో ఉన్నది.
గత నెలరోజులుగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరలు 16 రోజుల్లో 14 సార్లు పెరిగాయి. దీనితో లీటరుకు దాదాపు ₹ 10 పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ₹ 105.41కి అమ్ముడవుతుండగా, డీజిల్ లీటరు ₹ 96.67కి విక్రయిస్తున్నారు.
ముంబైలో ఇంధన ధరలు అల్ టైం హై గా ఉన్నాయి. పెట్రోల్ లీటరుకు ₹ 120.51 వద్ద రిటైల్ చేయబడింది. డీజిల్ లీటరుకు ₹ 104.77కి విక్రయించబడుతోంది.
ఇక ఎల్పీజీ గ్యాస్ విషయంలో 54 దేశాల్లో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఇక్కడి ఎల్పీజీ లీటర్ ధర 3.5 ఇంటర్నేషనల్ డాలర్ ధరతో సమానంగా ఉంది. ఇండియా తరువాత టర్నీ, ఫిజీ, మోల్దోవా, ఉక్రెయిన్ దేశాలున్నాయి. అదే స్విట్జర్లాండ్, కెనడా, ఫ్రాన్స్, యూకేల్లో ఎల్పీజీ లీటర్ ధర 1 ఇంటర్నేషనల్ డాలర్‌తో సమానంగా ఉంది
ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ నాలుగు నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలను నిలుపుకున్న బీజేపీ ఇది ఎన్నికల వ్యూహమని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే ధరల పెరుగుదలకు కారణమని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పుకోచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, శ్రీలంక వంటి దేశాలతో పోల్చితే భారత్‌లో కేవలం 5 శాతం మాత్రమే పెరిగిందని వివరణ ఇచ్చారు. యుద్ధం తర్వాత భారత్‌లో పెట్రోల్ ధరల పెంపు చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు.