మోడీకి "మహా" ఫోన్: ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొనసాగడానికి తొలిగిన అడ్డంకి!

By Sree s  |  First Published May 1, 2020, 7:54 AM IST

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేంఇంతవరకు చట్టసభకు ఎన్నికవలేదు. దుకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు మోడీకి ఉద్ధవ్ చేసిన ఫోన్ కాల్ తరువాత తొలిగిపోయేలా కనబడుతున్నాయి.


కరోనా వైరస్ కరాళ నృత్యానికి అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నప్పటికీ... అక్కడ రాజకీయ వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ రాజకీయ వేడి ఇప్పుడు ఒకింత సమసిపోయేదిలా కనబడుతుంది, కనీసం కొన్ని రోజుల వరకైనా!

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేంఇంతవరకు చట్టసభకు ఎన్నికవలేదు. దుకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు మోడీకి ఉద్ధవ్ చేసిన ఫోన్ కాల్ తరువాత తొలిగిపోయేలా కనబడుతున్నాయి. ఫోన్ చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ని స్వయంగా గవర్నర్ కోరారు. 

Latest Videos

undefined

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఆరు నెలలు కావొస్తుంది. ఏదైనా మంత్రి పదవిని చేపట్టిన ఆరు నెలల్లోపు ఆ చట్టసభలో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఉద్ధవ్ ఇంతవరకు చట్టసభకు ఎన్నికవలేదు. ఆయన ఆ పనిలో ఉండగానే ఈ కరోనా వైరస్ విరుచుకుపడింది. ఆయన మే నెలాఖరుకల్లా(మే 27) చట్టసభకి ఎన్నికవ్వాలి. 

ఈ కరోనా టెన్షన్ మధ్యలో ఎన్నికల కమిషన్ 9 సీట్లకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది. దానితో మహా కాబినెట్ గవర్నర్ కోటాలో ఉద్ధవ్ ను నామినేటే చేయాలనీ కోరినప్పటికీ.... ఆ సీట్ల గడువు జూన్ 10వ తేదీతో ముగుస్తున్నందున గవర్నర్ దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

ఇక లాభం లేదనుకొని ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసారు. ఈ సమయంలో రాజకీయాలకు సమయం కాదని, తరువాత రాజకీయాలకు చాలా సమయం ఉన్నందున ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో పని సాఫీగా జరిగిపోయేలా చూడాలని కోరారు. 

ప్రధానికి ఉద్ధవ్ చేసిన ఫోన్ పనిచేసింది. ఖాళీగా ఉన్న 9 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ ఎన్నికల కమిషన్ కి లేఖ రాసారు. ప్రభుత్వ సడలింపులు అనుసరించి జాగ్రత్తలు తీసుకొని ఈ ఎన్నికలను నిర్వహించొచ్చని ఆయన అన్నారు. 

దానితో ఇక ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కరోనా కాలంలో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తి సమయాన్ని, వనరులను ఈ కరోనా మహమ్మారి కట్టడికి వాడేందుకు వీలుంటుంది. 

click me!