మహారాష్ట్రలో కరోనా విలయతాండవం: 20 రోజుల పసికందుకు పాజిటివ్

By Siva KodatiFirst Published Apr 30, 2020, 7:34 PM IST
Highlights

కరోనా వైరస్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. 

కరోనా వైరస్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది.

Also Read:కరోనా రోగులకు ఇంట్యూబేషన్ బాక్సులు: ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

తాజాగా రాష్ట్రంలో 20 రోజుల పసిబిడ్డకు కరోనా సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్‌కు చెందిన 20 రోజుల శిశివు‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

ఈ పసిబిడ్డతో పాటు మరో ఆరుగురికి కూడా కోవిడ్ 19 సోకినట్లు అధికారులు తెలిపారు. వీరితో కలిపి ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 162కి చేరుకుంది. ఇప్పటి వరకు థానే జిల్లాలో కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. కాగా మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య 9,915కి చేరుకోగా, 432 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:కరోనా రోగుల్లో పెరిగిన రికవరీ రేటు, అక్కడే సడలింపులు: కేంద్ర ఆరోగ్య శాఖ

మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,823 కేసులు, 67 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 33,610‌ మందికి పాజిటివ్‌గా తేలగా, 1,075 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 8,373 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 

click me!