కరోనా రోగులకు ఇంట్యూబేషన్ బాక్సులు: ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

By narsimha lode  |  First Published Apr 30, 2020, 6:05 PM IST

అతి తక్కువ ఖర్చుతో ఇంట్యూబేషన్ బాక్సులకు ఐఐటీ గువాహటి విద్యార్థులు రూపకల్పన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంట్యూబేషన్ బాక్సులను తయారు చేశారు.


గువాహటి:అతి తక్కువ ఖర్చుతో ఇంట్యూబేషన్ బాక్సులకు ఐఐటీ గువాహటి విద్యార్థులు రూపకల్పన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంట్యూబేషన్ బాక్సులను తయారు చేశారు.

కరోనా వైరస్ మనిషి శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యంగా ఉన్న సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలోనే ఇంట్యూబేషన్ అవసరం ఉంటుంది. ఇంట్యూబేషన్ అంటే ఎండో ట్రాషియల్ ట్యూబ్ అనే ఓ గొట్టాన్ని నోటి ద్వారా వాయునాళం గుండా పంపిస్తారు.

Latest Videos

అనారోగ్యం ఉన్న సమయంలో రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న సమయంలో ఈ ఇంట్యూబేషన్ పనికొస్తోంది. ఈ బాక్స్ లను రోగి తలపై భాగంలో అమర్చుతారు.రోగి తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ బాక్సులు ఉపయోగపడతాయి. 

also read:కరోనా ఎఫెక్ట్: 100 కి.మీ సైకిల్‌పై వెళ్లి పెళ్లి, భార్యతో తిరిగి ఇంటికి...

దీని వల్ల పేషెంట్‌ పక్కనున్నవారికి, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని సులభంగా తయారు చేసే వీలుండటమే కాకుండా, వివిధ ప్రాంతాలకు సులువుగా సరఫరా చేసే అవకాశం ఉంది

ఇంట్యూబేషన్ బాక్స్ తయారు చేయడానికి దాదాపుగా రూ.2 వేలు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. ఈ బాక్సులను శుభ్రపరిచి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా బాక్సుల తయారీకి ఐఐటీ గువాహటి విద్యార్థులు విరాళాల కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆరు గంటల్లోనే రూ. 50వేలు సమకూర్చుకొన్నారు.

click me!