అసదుద్దీన్ ఒవైసీకి షాక్ .. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు

By Siva KodatiFirst Published Jun 29, 2022, 8:14 PM IST
Highlights

బీహార్ లో అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యేలు . ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రతిపక్ష ఆర్జేడీలో చేరారు. వీరిని స్వయంగా తేజస్వీ యాదవ్ స్పీకర్ వద్దకు తీసుకొచ్చారు. 
 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై (maharashtra crisis) దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీహార్ లోనూ (bihar) రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత (aimim)  అసదుద్దీన్ ఒవైసీకి (asaduddin owaisi) ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు (mim mla's) షాకిచ్చారు. వీరంతా ప్రతిపక్ష ఆర్జేడీ తీర్ధం పుచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 20 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపింది. 

ఫలితాల్లో ఐదు స్థానాల్లో గెలవడంతో పాటు ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది.  నాడు విజయం సాధించిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో మహ్మద్ ఇజార్ అస్ఫీ , షానవాజ్ ఆలం , సయ్యద్ రుక్నుద్దీన్ , అజర్ నయీమి ఆర్జేడీలో చేరగా.. అక్తరుల్ ఇమాన్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) .. ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికను ధ్రువీకరించారు. దీంతో బీహార్ శాసనసభలో మజ్లిస్ బలం ఒకటికి పడిపోయింది.

#Also REad:Udaipur Murder Case : రాడికలైజేషన్ ను నియంత్రించాలి.. హింస ఎలాంటిదైనా ఖండించాలి.. అసదుద్దీన్ ఓవైసీ..

బీహార్‌లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఎంఐఎం పెద్దలు ఫోకస్ పెట్టకపోవడం, వున్న కేడర్ పైనా నియంత్రణ లేకపోవడం కారణంగానే నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరారంటూ అక్కడ ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్జేజీ నానాటికీ బలోపేతం అవుతుండటంతో అధికార పార్టీని కాదని తేజస్వీ యాదవ్ పార్టీలోకి ఎంఐఎం ఎమ్మెల్యేలు చేరారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఇకపోతే.. నలుగురు మజ్లిస్ సభ్యులు ఆర్జేడీలో చేరడంతో బీహార్ లో అతిపెద్ద పార్టీ హోదా పొందింది. స్వయంగా కారు నడుపుతూ తేజస్వీ యాదవ్ వారిని అసెంబ్లీకి తీసుకొచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను ఆర్జేడీలో విలీనం చేయాలని ఆయన స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను (Vijay Kumar Sinha) కోరారు. 
 

click me!