Udaipur Murder Case : రాజస్థాన్ లో హై టెన్షన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్.. సమావేశాలు నిషేధం

Published : Jun 29, 2022, 10:14 AM IST
Udaipur Murder Case : రాజస్థాన్ లో హై టెన్షన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్.. సమావేశాలు నిషేధం

సారాంశం

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన టైలర్ హత్యతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 24 గంటల పాటు సమావేశాలను కూడా నిషేధించింది. 

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన టైలర్ హత్య దేశ వ్యాప్తంగా కలకరం రేపింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 గంట‌ల పాటు స‌మావేశాల‌ను నిషేదించారు. అలాగే ఇంట‌ర్నెట్ ను నిలిపివేశారు. ఈ ఘ‌ట‌న‌లో భాగంగా ఉన్న నిందితులు గోస్ మహ్మద్, రియాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం రూ.31 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. 

Udaipur Murder Case : రాడికలైజేషన్ ను నియంత్రించాలి.. హింస ఎలాంటిదైనా ఖండించాలి.. అసదుద్దీన్ ఓవైసీ..

ఇటీవ‌ల బీజేపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన‌ర బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ కు రాజస్థాన్‌లోని ఉదయపూర్ కు చెందిన ఓ టైల‌ర్ కన్హయ్య లాల్ సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. దీనిని పోస్ట్ చేసినందుకు చేసినందుకు ఓ వ‌ర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత‌డి దుకాణంలోకి ప్ర‌వేశించి త‌ల‌న‌రికారు. ఈ  భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఇద్దరు నిందితులు హత్యాయుధాలతో కనిపించడంతోపాటు నేరాన్ని అంగీకరించారు. ఈ వీడియోలో నిందితులు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని బెదిరించారు.

Plastic Items Ban: జులై 1 నుంచే సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం.. అవి వాడితే క‌ఠిన చ‌ర్య‌లే..!

ఈ వీడియోలో క‌నిపించిన నిందితుల‌ను గోస్ మహ్మద్, రియాజ్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ హ‌త్య రాజస్థాన్ లోని ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు కారణమైంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  ప్ర‌జ‌ల‌ను కోరారు. ‘‘ఉదయ్‌పూర్‌లో యువకుడి దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దీనిపై పోల‌సులు పూర్తి స్థాయి ద‌ర్యాప్తు జ‌రుపుతారు.  శాంతిని కాపాడాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. ‘‘ఇది విచారకరమైన & అవమానకరమైన సంఘటన. నేడు దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ & అమిత్ షా దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు? ప్రజల్లో టెన్షన్‌ నెలకొంది. అటువంటి హింసను సహించబోమని, శాంతి కోసం విజ్ఞప్తి చేయాలని ప్రధాని ప్రజలను ఉద్దేశించి చెప్పాలి’’ అని ఉదయపూర్ హత్యపై  స్పందిస్తూ  సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. 

ఈ ఘటనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హేయమైన చర్యలు మన సామరస్య జీవనానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. ‘‘ ఉదయ్‌పూర్‌లో జరిగిన పాశవిక హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను. ఇలాంటి హేయమైన చర్యలు వ‌ల్ల సామరస్య జీవనానికి విఘాతం కలుగుతోంది. శాంతి, ప్రశాంతతను కాపాడాలని, చట్టం తన నిర్ణయానికి రావాలని ప్రతిఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్నారు.’’ అని విజయన్‌ ట్వీట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?