
బెంగళూరు : పీక్ టైంలో క్యాబ్ బుక్ చేసిన అనుభవం ఉన్నవారికి ఈ స్టోరీ బాగా రిలేట్ అవుతుంది. ఉబర్, ఓలా, రాపిడో.. యాప్ లలో టూ వీలర్, ఆటో, కారు.. ఏది బుక్ చేసినా సరే వెయిటింగ్ టైం ఓపికకు పరీక్ష పెడుతుంది. ముందు బుక్ కాదు.. ఆ తరువాత వెయిటింగ్ టైం.. పావుగంటనుంచి 20ని.లవరకు ఉంటుంది. క్యాన్సిల్ చేద్దామా అంటే.. మళ్లీ బుక్ అయ్యేదికూడా అలాగే ఉంటుంది. దీంతో జీవితం మీద విరక్తి కలుగుతుంది. అయితే.. మహానగరాల్లో ఇలాంటి పరిస్థితి మామూలే.
బెంగళూరులో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం వింటే.. ‘నువ్వు దేవుడివిరా బాబూ’ అంటూ మీరు దండం పెడతారు. ఓ వ్యక్తి బెంగళూరులో క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ అయితే బుక్ అయ్యింది కానీ వెయిటింగ్ టైం మాత్రం సింపుల్ గా 71ని.లు చూపించింది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.
అతను ఆ డైలమాలో ఉండగానే క్యాబ్ డ్రైవరే కనికరించి ఒక్క నిమిషంలో రైడ్ క్యాన్సిల్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను అతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అనుశాంక్ జైన్ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఉబర్ యాప్‌లో తాను బుక్ చేసిన ఆటో రైడ్ స్క్రీన్‌షాట్‌ను పీక్ బెంగళూరు అనే హాష్ ట్యాగ్ తో షేర్ చేశాడు. ఫోటోలో, ఒక ఆటో డ్రైవర్ రైడ్‌ని అంగీకరించినట్లు కనిపిస్తుంది. కానీ, ఆ ఆటో 24 కిలోమీటర్ల దూరంలో కనిపించింది
బెంగళూరులోని భయంకరమైన ట్రాఫిక్ జామ్‌ల గురించి కథలు కథలుగా విని ఉంటాం. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రద్దీతో నగరం ఎలా బాధపడుతుందనే దాని గురించి చాలా జోకులు కూడా ఉన్నాయి. ఇక క్యాబ్ లాంటివి దొరకాలంటే తలకిందులు తపస్సు చేయాల్సిందే. ముఖ్యంగా నగర శివార్ల నుంచి కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ రకమైన అసౌకర్యం గురించి చాలా ఫిర్యాదులు ఉన్నాయి.
కేరళలో 64,000 మంది మాత్రమే నిరుపేదలు - సీఎం పినరయి విజయన్
బెంగళూరు వాసులు ట్రాఫిక్ పరిస్థితి గురించి అతిశయోక్తిగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే, పరిస్థితి ఎంతవరకు నిజమో ఈ ఘటన మీకు చూపిస్తుంది. ట్విట్టర్ యూజర్ అనుశాంక్ జైన్ ఉబర్ యాప్‌లో తాను బుక్ చేసిన ఆటో రైడ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఫోటోలో, ఒక ఆటో డ్రైవర్ రైడ్‌ని అంగీకరించినట్లు కనిపిస్తుంది. కానీ,
ఆటో 24 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెయిటింగ్ టైం 71 నిమిషాలు! ఆ సమయంలో, ఢిల్లీ నుండి విమానంలో సులభంగా జైపూర్ చేరుకోవచ్చు. ఆ సమయంలో, డీడీఎల్ జే సినిమాని ఇంటర్వెల్ వరకు చూడవచ్చు. ఈ ఉదాహరణలన్నీ ఎందుకంటే.. పరిస్థితి ఏంటో మీకు అర్థం కావడం కోసమే.
దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఒకరు నిజంగా అతను కనక వస్తే.. అతని ఓపికకు దండం పెట్టాలి.. అని కామెంట్ చేశారు. దీనికి అనుశాంక్ జైన్ సమాధానం ఇస్తూ... ‘ఆ డ్రైవర్ పిచ్చివాడు కాదు. రైడ్ రిక్వెస్ట్ ను వెంటనే ఒక్క నిమిషంలోనే రద్దు చేశాడు’ అని చెప్పుకొచ్చాడు.