గుజరాత్ రాష్ట్రంలో బోరుబావిలో రెండేళ్ల చిన్నారి పడింది. బోరు బావి నుండి బాలికను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా జిల్లా కళ్యాణ్‌పూర్ తహసీల్ లోని రాన్ గ్రామంలో రెండున్నర ఏళ్ల బాలిక బోరు బావిలో పడింది. ఈ విషయం తెలిసిన జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా జిల్లా కళ్యాణ్ పూర్ లో తహసీల్ లో రాన్ గ్రామంలో రెండున్నర ఏళ్ల బాలిక బోరు బావిలో పడింది.ఏంజెల్ సఖ్రా అనే బాలిక ఓపెన్ బోర్ వెల్ లో పడిపోయింది. సోమవారం నాడు మధ్యాహ్నం ఆమె తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ బోర్‌బావిలో పడింది. బోర్ బావిలో 30 అడుగుల లోతులో బాలిక చిక్కుకుంది.
స్థానిక అగ్నిమాపక దళం రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఆరోగ్య శాఖ బృందం బోర్‌వెల్‌లోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు.బోర్‌బావి నుండి బాలిక ఏడుపులు విన్పిస్తున్నాయి.ఆమె సజీవంగా ఉందని అధికారులు ధృవీకరించారు. భారత ఆర్మీ బృందం కూడ రెస్క్యూ కోసం గ్రామానికి వస్తుంది. ఏంజెల్ ను సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఘటన స్థలంలో అంబులెన్స్ ను సిద్దంగా ఉంచినట్టుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడ సిద్దంగా ఉంది.ఇవాళ మధ్యాహ్నం గాంధీనగర్ నుండి సంఘటన స్థలానికి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం బయలు దేరింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ లోని పిప్లియా రాసోడా గ్రామంలో గత ఏడాది డిసెంబర్ మాసంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.ఆ బాలికను సురక్షితంగా కాపాడారు.బోరు బావి నుండి బయటకు తీసుకు వచ్చిన తర్వాత ఆ బాలిక మృతి చెందింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.