కేరళ నరబలి కేసు: ఇద్దరు మహిళలను ఏ విధంగా బలి ఇచ్చారు? ఎందుకు చేశారు?

Published : Oct 12, 2022, 02:47 PM ISTUpdated : Oct 12, 2022, 02:51 PM IST
కేరళ నరబలి కేసు: ఇద్దరు మహిళలను ఏ విధంగా బలి ఇచ్చారు? ఎందుకు చేశారు?

సారాంశం

కేరళ నరబలి కేసుకు సంబంధించి కలవరం పెట్ట విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు మహిళలను క్రూరంగా చంపి ముక్కలుగా నరికేశారు. కొన్ని అంగాలను వండుకుని తిన్నారు. రక్తాన్ని గోడలపై వెదజల్లారు. పుస్తకాల్లోని మంత్రాలు చదువుతూ నరబలి ఇచ్చి ఇంటి వెనుకాల గోతుల్లో పూడ్చి పెట్టారు.  

తిరువనంతపురం: కేరళలో ఇద్దరు మహిళలు రోస్లిన్, పద్మలను ముగ్గురు నరబలి కింద అతిదారుణంగా చంపేశారు. ఈ కేసుకు సంబంధించి ఊహించ సాధ్యం  కాని విషయాలు వెల్లడవుతున్నాయి. కేరళ సహా యావత్ దేశంలోనూ ఇప్పుడు ఈ నరబలి ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే నరబలి అసలు ఎందుకు చేశారు? ఏ విధంగా నరబలి ఇచ్చారు? అనే విషయాలను చూద్దాం.

పతానంతిట్ట జిల్లా ఎలంథూర్ గ్రామంలో సాంప్రదాయ మస్సాజ్ చేసే కుటుంబం వారిది. తండ్రి వారసత్వాన్నే భగవాల్ సింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలని వారు క్షుద్రపూజల వైపు చూశారు. ఈ అశాస్త్రీయ దృష్టికి ఓ పర్వర్ట్ ఆజ్యం పోశాడు. పెరుంబవూరుకు చెందిన ముహమ్మద్ షఫీ అనే ఓ మూఢుడు వారికి నరబలి ఇవ్వాలని సూచించాడు. నరబలితో వారి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాదు.. సిరి సంపదలతో వర్ధిల్లుతారని, నిత్యం యవ్వనులుగా ఉంటారని నమ్మించాడు. ఇవి సాధ్యం కావాలంటే కచ్చితంగా నరబలి జరగాల్సిందేనని నూరిపోశాడు. నిండా అజ్ఞానంలో మునిగిన ఆ ఇద్దరు దంపతులూ అందుకు సరే అన్నారు.

Also Read: నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు.. ముక్కలుగా నరికి.. శరీరలను ఉడికించుకుని తిన్న నిందితులు

ఈ షఫీనే ఇద్దరు మహిళలను నమ్మించి మోసం చేసి ఈ దంపతుల వద్దకు నరబలి కోసం తీసుకువచ్చాడు. తొలిగా రొస్లిన్‌ను బలి ఇచ్చారు. జూన్ నెలలో ఈమె అదృశ్యమైంది. ఆమెను షఫీ భగవాలల్ ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత ఆమెను చంపేసి ముక్కలుగా నరికేశారు. బెడ్‌కు కట్టేసి తలను పగులగొట్టారు. ఆ తర్వాత గొంతు కోశారు. ఇదంతా వారు పుస్తకంలో మంత్రాలు చదువుతూ చేశారు. అనంతరం ఇంటి వెనుక భాగంలో బాడీ పార్టులను పూడ్చి పెట్టారు. కానీ, వారికి సిరి సంపదలు రాలేదు. ఇదే విషయాన్ని ఆ దంపతులు షఫీ ముందు ప్రస్తావించారు. దీంతో ఆ నరబలి క్రతువు సరిగా సాగలేదని, మరో బలి ఇవ్వాల్సిందే అని అన్నట్టు ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.

సెప్టెంబర్‌లో పద్మ అనే మహిళను షఫీ వెంట తెచ్చాడు. రూ. 15 వేల ఇస్తానని ఆమెను సెప్టెంబర్ 26న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భవలాల్ సింగ్ ఇంటికి తీసుకెళ్లినట్టు న్యూస్ 18 అనే ఇంగ్లీష్ న్యూస్ సైట్ తెలిపింది. ఆ ఇంటిలో బెడ్ రూమ్‌లో డబ్బులు ఇవ్వాలని పద్మ అడిగింది. దానికి షఫీ తిరస్కరించాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఓ ప్లాస్టిక్ తీగతో ఆమె మెడకు గట్టిగా చుట్టాడు. ఆమె స్పృహ కోల్పోయింది. 

Also Read: దారుణం : కేరళలో ఇద్దరు మహిళల నరబలి, ముగ్గురి అరెస్ట్..

ఆ తర్వాత ఆమె బాడీని మరో గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే పదునైన ఆయుధంతో ఆమె బాడీని ముక్కలుగా కట్ చేశారు. ఆమె గొంతు కోసినట్టు పోలీసుల రిమాండ్ కాపీలో ఉన్నదని ఆ సైట్ వివరించింది. ఆమె రక్తాన్ని ఆ గదిలో గోడలపైనా చల్లారు. ఫ్లోర్ కూడా రక్తంతో తడిచింది. ముక్కలుగా చేసిన ఆమె బాడీకి చెందని కొన్నింటిని వండుకున్నారు. ఆ బాడీ పార్టులను తిన్నట్టు భగవలాల్ సింగ్ భార్య లైలా పోలీసులకు తెలిపినట్టు ఇండియా టుడే పేర్కొంది. ఇలా తింటే.. వారు నిత్య యవ్వనులుగా ఉంటారని షఫీ చెప్పినట్టు ఆమె పేర్కొన్నట్టు వివరించింది.

ఆ తర్వాత ఇంటి వెనుక ప్రాంగణంలో మూడు గోతులు తవ్వి వాటిని పూడ్చి పెట్టారు. ఆ తర్వాత వాటిపై ఉప్పు నీరు చల్లినట్టు పోలీసులు కనుగొన్నారు. మంగళవారం నిందితులను స్పాట్‌కు తీసుకెళ్లి ఆ బాడీ పార్టులను తవ్వితీసినట్టు పోలీసులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu