
పాట్నా: బీహర్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో గంధక్ నదిని దాటే సమయంలో పడవ బోల్తా పడడంతో ఇద్దరు మరణించారు. మరో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పడవలో వెళ్తున్న సమయంలో పడవ బోల్తాపడింది.
వైశాలి జిల్లాలోని లాల్ గంజ్ ప్రాంతంలో గంధక్ నదిని దాటే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పడవలో వెళ్తున్న సమయంలో పడవ బోల్తాపడింది. పడవ బోల్తా పడిన సమయంలో నదిలో పడిన వారిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
నది నుండి రెండు మృతదేహలను పోలీసులు వెలికి తీశారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం హాజీపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృుతులను అనిల్, రాజేష్ గా గుర్తించారు. జఫరాబాద్ ప్రాంతంలోని అమృత్ పూర్గ్ గ్రామ వాసి అనిల్. రాజేష్ ది భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహువా గ్రామంగా పోలీసులు తెలిపారు.పాట్నాలలోని దానాపూర్ ప్రాంతంలోని గంగా నదిలో 55 మందితో వెళ్తున్న పడవ ముగిని నెల రోజులు దాటిన తర్వాత ఇవాళ మరో ఘటన చోటు చేసుకుంది.