పినరయి మౌనం అసహ్యం కలిగిస్తోంది.. కేరళ నరబలిపై బీజేపీ ఫైర్

Published : Oct 12, 2022, 02:32 PM IST
పినరయి మౌనం అసహ్యం కలిగిస్తోంది.. కేరళ నరబలిపై బీజేపీ ఫైర్

సారాంశం

కేరళలో జరిగిన నరబలి ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా దిగ్భ్రాంతి క‌లిగిస్తోంది.  ఈ కేసులో నిందితులైన భగ్వల్ సింగ్, అతని భార్య లైలా, తాము ఇద్దరు మహిళలను హతమార్చారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం పినరయి విజయన్ టార్గెట్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేరళలో జరిగిన నరబలి ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా దిగ్భ్రాంతి క‌లిగిస్తోంది.  ఈ కేసులో నిందితులైన భగ్వల్ సింగ్, అతని భార్య లైలా, తాము ఇద్దరు మహిళలను హతమార్చారు. ఆ పాచ‌విక చ‌ర్య‌ను అంత‌టితో ఆప‌కుండా.. వారి మృత‌దేహాలను ముక్క‌లుగా కోసి.. ఆ భాగాలను వండి మాంసం తిన్నారు. అనంత‌రం ఆ శ‌వాల‌ను తమ ఇంటి సమీపంలో ఖననం చేశారు. కేరళలోని పతనమిత్త జిల్లా ఎలంథూర్ లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు సీపీఎం కార్యదర్శి అని, ప్రస్తుతం ఎలంథూర్ సీపీఎం కమిటీ లోకల్ సభ్యుడు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఘాటుగా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితులు ఉన్నార‌ని, ప్రధాన నిందితుడు అధికార పార్టీ సీపీఎం  సభ్యుడనీ అన్నారు. ముగ్గురిలో ఒకరు ముస్లిం నిందితుడు ఉన్నార‌నీ తెలిపారు .బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే లాబీ ఎలా ఉండేదని పూనావల్ల ప్రశ్నించారు. ఈ అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న‌తో కేరళ ప్రభుత్వం మహిళలకు ఏవిధమైనా రక్షణ అందిస్తుందో అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. 

కేరళలో పాలక యంత్రాంగం గుండాల ఆగ‌డాలు తీవ్ర‌మయ్యాయ‌నీ, వారిపై ప్ర‌భుత్వానికి నియంత్రణ లేని కారణంగా ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతాయ‌ని ఆరోపించారు. సమస్యలపై స్థానిక, వాగ్ధాటి లాబీ యొక్క లౌకిక మౌనం మరింత ఆశ్చర్యకరమైనదనీ,  దిగ్భ్రాంతికరమైనదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

సాధారణంగా స్త్రీల భద్రత, మానవ హక్కుల గురించి.. బహుశా ఓట్లు పోతాయనే భయం వల్లనో, లేక ఇలా జరిగిన రాష్ట్రంలో రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనుకూలం కానందువల్లనో.. వారు నేడు  మౌనంగా ఉన్నార‌ని విమ‌ర్శించారు. అమయాక మ‌హిళ‌ల‌ను ప్ర‌లోభ పెట్టి.. వారిని చంపి,  మృతదేహాలను పాతిపెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఈ ఘ‌ట‌నను కేంద్ర మంత్రి వి మురళీధరన్ తప్పుబట్టారు. ఈ దారుణంలో  సీపీఎం సభ్యుడి ప్రమేయం ఉందని, అందుకే రాష్ట్ర పోలీసుల ఆలస్యంగా స్పందించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కేరళలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. సీపీఎం సభ్యుడి ప్రమేయం ఉండ‌టం వ‌ల్ల‌నే పినరయివిజయన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందా? ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురవుతుండగా సీఎం మౌనంగా ఉండటం అసహ్యం కలిగిస్తోందని విమ‌ర్శించారు .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే