
మానవత్వం చచ్చిపోయింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. మనుషులు మృగాల కన్నా హీనంగా ప్రవరించారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేశారనే ఆరోపణలపై ఇద్దరు అమాయకులకు దారుణంగా శిక్షించారు.ఈ దారుణం ఘటనను గుర్తు చేసుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దొంగతనానికి పాల్పడారనే అనుమానంతో ఆ అమాయకులిద్దరూ ఓ మూక దారుణంగా చితకదాచింది. ఆపై బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా మూత్రం తాగించారు. అంతటితో ఆగకుండా.. ప్రైవేట్ పార్టుల్లో కారం పోశారు. ప్రసుత్తం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివస్త్రను చేసి..
ఈ దారుణ ఘటన సిద్ధార్థనగర్ జిల్లా పత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తెరపైకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన కోనక్తి కూడలి సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో జరిగింది. ఆగస్టు 4 తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై అర డజన్ పైగా మంది ..ఇద్దరూ పిల్లలను పట్టుకున్నారు. పిల్లలిద్దరిపై నిందుతులు అత్యంత క్రూరంగా,అమానవీయంగా దాడి చేశారు. తర్వాత ఓ బాటిల్‌లో మూత్ర విసర్జన చేసి..పిల్లలిద్దరితో బలవంతంగా తాగించారు.
అంతటితో వారి దారుణం ఆగలేదు. వారి పైశాచికంగా వారి ప్రవేట్ పార్టుల్లో కారం గుప్పించారు. పిల్లలిద్దరూ ఆ బాధను భరించలేక రోధించారు. అయినా వారి క్రూరత్వం ఆగలేదు. నిందితులు కలిసి పిల్లలిద్దరినీ వివస్త్రను చేసి చేతులు కట్టేస్తారు. తర్వాత పిల్లలిద్దరికీ ఇంజక్షన్లు కూడా వేస్తారు. ఆ తర్వాత పిల్లలిద్దరినీ విడుదల చేస్తారు. ఈ సంఘటనతో మైనర్ పిల్లలిద్దరూ చాలా భయపడ్డారని, వారు తమ బాధను తానే భరిస్తూనే ఉన్నారు.
వీడియో వైరల్
24 గంటల తర్వాత.. ఓ ఘటన సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసులు ఆ వీడియోను దృష్టికి తీసుకెళ్లారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఈ విషయం పిల్లలిద్దరి బంధువులకు తెలియడంతో 8 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఏం చెప్పారు
ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలపై అభ్యంతరకరమైన చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీన్ని వెంటనే గుర్తించి.. నిందితులపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటి వరకు 6 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.