"నన్ను శివుడు పంపాడు": 85 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 60 ఏళ్ల వృద్ధుడు.. వీడియో వైరల్..

Published : Aug 06, 2023, 02:51 PM IST
"నన్ను శివుడు పంపాడు": 85 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 60 ఏళ్ల వృద్ధుడు.. వీడియో వైరల్..

సారాంశం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 85 ఏళ్ల మహిళపై 60 ఏళ్ల వృద్ధుడు విచక్షణరహితంగా దాడి చేసి.. హత్య చేశారు. వృద్ధురాలిపై దాడి చేస్తున్న షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. 

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. 85 ఏళ్ల మహిళపై 60 ఏళ్ల వృద్ధుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. వృద్ధురాలిపై దాడి చేస్తున్న షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో మరణించిన వృద్ధురాలిని కల్కీ బాయి గామెటి  గుర్తించారు. వైరల్ వీడియోలో ఇద్దరు మైనర్లు కూడా చూడవచ్చు. ఈ వారు దాడిని ఆపేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. పక్కనే ఉన్న మరో యువకుడు ఈ ఘటనను చిత్రీకరించారు.

ఈ నేరానికి సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరల్ వీడియోలో నిందితుడు..  వృద్ధురాలు పక్కన కూర్చుని, తనని తాను శివుడి అనుచరుడినని చెప్పుకోవడం చూడవచ్చు. ఆ వెంటనే అకస్మాత్తుగా ఆమె ఛాతీపై చాలా బలంగా కొట్టాడు. దీంతో ఆ మహిళ నేలపై పడిపోతుంది.  ఆ తరువాత నిందితుడు ఆమె జుట్టు పట్టి లాగడం.. నేలపై పడుకుని పడి ఉన్నా ఆమె తలపై గొడుగుతో దారుణంగా కొట్టడం కూడా  చూడవచ్చు.  
 
మద్యం మత్తులో ఉన్న నిందితుడు ప్రతాప్ సింగ్ వింతగా ప్రవర్తిస్తున్నాడనీ, అతను తనను తాను శివుని అవతారంగా ఊహించుకున్నాడనీ,  స్త్రీని చంపి, ఆమెను మళ్లీ బతికించగలనని నమ్మాడని పోలీసులు తెలిపారు.ఆ నిందితుడ్ని ఆపడానికి ప్రయత్నించిన యువకులకు దారుణంగా దూషిస్తూ.. దాడి చేసే ప్రయత్నించాడని, ఆ యువకులు ఎంత వారించిన పట్టించుకోలేదని తెలిపారు.

నిందుతుడు బాగా తాగి ఉన్నాడని, అతడు  మతిస్థిమ్మితం కోల్పోయినట్టు ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మరో వ్యక్తి ఉన్నాడని,మైనర్లు వీడియోను చిత్రీకరిస్తున్నారని  ఉదయపూర్ పోలీసు సూపరింటెండెంట్ భువన్ భూషణ్ తెలిపారు. మరోవైపు..  వృద్ధురాలు మంత్రగత్తె అనే అనుమానంతో నిందితుడు ప్రతాప్ సింగ్ ఆమెను హత్య చేశాడనే పుకార్లను పోలీసులు తోసిపుచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?