
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘర్షణ జరిగింది. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కత్తిపోట్లకు గురై ప్రాణాలు వదిలారు. కాగా, మరో ఐదుగురు గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఢిల్లీలోని ముంద్కా ఏరియాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘర్షణ, కత్తిపోట్లు, మరణం గురించిన విషయాలకు సంబంధించిన ఢిల్లీ పోలీసులకు మధ్యాహ్నం 1.36 గంటలకు, 1.42 గంటలకు, 1.47 గంటలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ముంద్కా ఏరియా నుంచి బుధవారం ఆ ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.
ఫ్రెండ్స్ ఎంక్లేవ్ ముంద్కాలోని 14వ వీధిలో సోను, అభిషేక్‌లు నివసిస్తున్నారు. అభిషేక్, అతని ఫ్రెండ్స్ అంతా కలిసి సోనుపై కత్తితో దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇలా అడ్డుకోవడానికి వచ్చిన వారిపైనా కత్తితో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, అభిషేక్ పైనా కత్తితో దాడి జరిగిందని వివరించారు.
Also Read: ఢిల్లీలో రోడ్డుపై కూలిపోయిన బిల్డింగ్.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు.. (వీడియో)
కత్తిపోట్లకు గురైన ఏడుగురిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. సోనూ, నవిన్‌లు అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. అభిషేక్, మరో వ్యక్తికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారిని సఫ్దార్ జంగ్ హాస్పిటల్‌కు చికిత్స కోసం రిఫర్ చేశారు. మరో ముగ్గురు క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు ఫైల్, చేయడం దర్యాప్తు చేయడం గురించి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇదిలా ఉండగా... ఈ ఘర్షణలో పాల్గొన్నవారు ముంద్కా ఏరియాలో నమ్కీన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులని పోలీసులు తెలిపారు. ఈ గొడవ జరగడానికి గల ప్రధాన కారణం ఏమిటన్న విషయం ఇంకా తెలియరాలేదు అని పోలీసులు తెలిపారు.