ఢిల్లీలో రోడ్డుపై కూలిపోయిన బిల్డింగ్.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు.. (వీడియో)

Published : Mar 08, 2023, 07:21 PM IST
ఢిల్లీలో రోడ్డుపై కూలిపోయిన బిల్డింగ్.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు.. (వీడియో)

సారాంశం

ఢిల్లీలోని భజన్‌పురా ఏరియాలో రోడ్డు పక్కనే ఉన్న ఓ బిల్డింగ్ కుప్పకూలిపోయింది.  ఆ బిల్డింగ్ నేరుగా రోడ్డు పై పడిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు పక్కనే ఉన్న ఓ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. అది సరాసరి రోడ్డు పై పడిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఆ బిల్డింగ్ కూలిపోతూ.. సమీపంలోని విద్యుత్ తీగలను, పోల్‌లను నేలమట్టం చేసింది. ఢిల్లీలోని భజన్‌పురా ఏరియాలోని ఈ బిల్డింగ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత స్థానికులు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేశారు. మధ్యాహ్నం 3.05 గంటలకు తమకు కాల్ అందినట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవని అధికారులు చెప్పారు.

Also Read: బైక్ పై లవర్‌ను ఎదురుగా కూర్చోబెట్టుకుని లిప్ కిస్సులు.. నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వైరల్ వీడియో ఇదే

మార్చి 1వవ తేదీన ఢిల్లీలోని రోషనారా రోడ్డులోనూ నాలుగు అంతస్తులు భవనం ఒకటి మంటలు అంటుకున్న తర్వాత కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్రాణ హాని జరగలేదని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu