దారుణం : మైనర్లపై సామూహిక అత్యాచారం, బలవంతంగా పురుగుల మందు తాగించి...

Published : Aug 11, 2021, 09:28 AM IST
దారుణం : మైనర్లపై సామూహిక అత్యాచారం, బలవంతంగా పురుగుల మందు తాగించి...

సారాంశం

ఇద్దరు మైనర్ అక్కా చెల్లెళ్లపై దారుణంగా సామూహిక లైంగింకదాడి చేసి ఆ తరువాత వారితో బలవంతంగా పురుగుల మందు తాగించారు మృగాళ్ళు. అంతేకాదు చివరికి వారికి పాము కాటువేసి చనిపోయారని చెప్పాల్సిందిగా తల్లిని బెదిరించారు.  

చండీగఢ్ : అమ్మాయిల మీద ఆకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మైనర్ బాలికల మీద సామూహిక దాడులు చేసి.. తరువాత తమ తప్పు బయటపడుతుందని చంపేస్తున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

అలాంటి దారుణ ఘటనే హర్యానాలో జరిగింది. ఇద్దరు మైనర్ అక్కా చెల్లెళ్లపై దారుణంగా సామూహిక లైంగింకదాడి చేసి ఆ తరువాత వారితో బలవంతంగా పురుగుల మందు తాగించారు మృగాళ్ళు. అంతేకాదు చివరికి వారికి పాము కాటువేసి చనిపోయారని చెప్పాల్సిందిగా తల్లిని బెదిరించారు.  

ఈ దారుణ ఘటనలో నలుగురిని పోలీసులు  అరెస్ట్ చేశారు. హర్యానాలోని సోనిపట్‌లో ఓ గ్రామంలో ఇద్దరు మైనర్ సోదరీమణులను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, బలవంతంగా పురుగుల మందు తాగించారని  చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

నలుగురు నిందితులు 22 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరంతా వలస కార్మికులు. బాలికలు ఉండే ఇంటి పక్కనే వీరూ అద్దెగదిలో ఉంటున్నారు. అమ్మాయిలిద్దరూ 14, 16 సంవత్సరాల వయస్సు లో ఉన్నారు. వీరు కూలీపనులకు వెళ్లేవారు. వీరిద్దరూ తల్లితో కలిపి ఉంటున్నారు. 

వీరిమీద కన్నేసిన నిందితులు ఆగష్టు 5, 6 మధ్య రాత్రి.. బాలికల ఇంటికి వచ్చారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి తల్లిని బెదిరించారు. అనంతరం నలుగురు వ్యక్తులు ఇద్దరు అక్కాచెల్లెలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వారితో బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఎలా చనిపోయారని అడిగితే పాము కాటేసిందని చెప్పాలని తల్లిని బెదిరించారు. 

వారి పరిస్థితి దిగజారుతుండడంతో భయపడ్డ నిందితులు హాస్పిటల్ కు తీసుకువెళ్లమని తల్లికి చెప్పారు. కానీ పాము కరిచిందని చెప్పాలని, లేకపోతే ముగ్గుర్నీ చంపేస్తామని బెదిరించారు. తల్లి సరే నని ఒప్పుకుని కూతుర్లను ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకువచ్చింది. 

అయితే మార్గమధ్యంలోనే ఓ అమ్మాయి చనిపోయింది. మరో అమ్మాయి చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఈ మేరకు వైద్యులు నిర్తారించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు తల్లిని ప్రశ్నించగా.. ముందుగా ప్రాణభయంతో ఆస్పత్రి వర్గాలకు గానీ, పోలీసులకు గానీ అసలు విషయం చెప్పలేదు. పాము కాటేసిందనే చెప్పింది. 

దీంతో అనుమానం వచ్చి అధికారులు పోస్ట్ మార్టం జరిగించగా బాలికల మీద లైంగిక దాడి జరిగిన విషయం బయటపడింది. అంతేకాదు వారిమీద విషప్రయోగం జరిగిందని కూడా తేలింది. దీంతో తల్లి అసలు విషయం బయటపెట్టింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.

ఇక మరో ఘటనలో, గుర్గావ్‌కు చెందిన 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కొద్దికాలంగా ఓ యువకుడు ఆమెను వేధిస్తుండడం, వెంటపడుతుండడంతో మానసిక వేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పటౌడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దీపక్ సంధు మాట్లాడుతూ, ఆగస్టు 6న బాలిక తన ఇంటిలో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ యువకుడు ఆమెను వేధించేవాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిమీద కేసు నమోదుచేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామరి సంధు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu