Pet Dog: రెండు పెంపుడు కుక్కల మధ్య పోట్లాట.. షూట్ చేసిన యజమాని.. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం (Video)

Published : Aug 18, 2023, 12:27 PM ISTUpdated : Aug 18, 2023, 12:34 PM IST
Pet Dog: రెండు పెంపుడు కుక్కల మధ్య పోట్లాట.. షూట్ చేసిన యజమాని.. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం (Video)

సారాంశం

మధ్యప్రదేశ్‌లో రెండు పెంపుడు కుక్కల మధ్య పోట్లాట.. వాటి యజమానుల మధ్య గొడవకు దారి తీసింది. వీరి మధ్య గొడవ పెరగడంతో చుట్టుపక్కలవారు గుమిగూడారు. ఇంతలో ఓ యజమాని ఇంటిలోకి వెళ్లి తుపాకీ తీసుకువచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇందులో ఇద్దరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. రెండు పెంపుడు కుక్కల మధ్య పోట్లాట.. ఇద్దరి దుర్మరణానికి కారణమైంది. ఇరుగు పొరుగునే ఉండే రెండు పెంపుడు కుక్కలు పోట్లాడుకున్నాయి. ఇది ఆ రెండు పెంపుడు కుక్కల యజమానుల మధ్య గొడవకు దారి తీసింది. గొడవ పెరగడంతో పలువురు అక్కడ గుమిగూడారు. కోపంతో ఓ యజమాని ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకువచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.

ఇండోర్‌లో నివసిస్తున్న రాజ్ పాల్ రావత్ ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తాను పెంచుకుంటున్న కుక్క, పొరుగింటి పెంపుడు శునకం పోట్లాటకు దిగాయి. ఈ రెండు కుక్కల మధ్య పోట్లాట.. యజమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. యజమానులు ఇద్దరూ గొడవ పడ్డారు. వారి మధ్య గొడవ తీవ్రత పెరగడంతో చుట్టుపక్కల వారు వచ్చి గుమిగూడారు.

ఈ గొడవతో తీవ్రమైన కోపంతో రాజ్ పాల్ రావత్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. తుపాకీ తీసుకువచ్చి ఉన్నపళంగా కాల్పులు జరిపాడు. రావత్ తుపాకీ నుంచి దూసుకువెళ్లిన తూటాలు ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమయ్యాయి. మరో ఆరుగురూ తూటాలతో గాయపడ్డారు. వారిని హాస్పిటల్ తీసుకెళ్లారు. వారికి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: మతి స్థిమితం లేని వ్యక్తిని.. కాళ్లు, చేతులు, మెడ కట్టేసి, రైలు సీటు కిందికి తోయడంతో....

తుపాకీ కాల్పుల్లో మరణించిన వారిని 28 ఏళ్ల రాహుల్, 35 ఏళ్ల విమల్‌గా గుర్తించారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. రాజ్ పాల్ రావత్‌ను అరెస్టు చేశారు. ఆయన నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?