విషాదం : కారులో మంటలు చెలరేగి, గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనం..

Published : Feb 02, 2023, 12:47 PM ISTUpdated : Feb 02, 2023, 12:48 PM IST
విషాదం : కారులో మంటలు చెలరేగి, గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనం..

సారాంశం

కన్నూరులో ఓ కారులో మంటలు చెలరేగడంతో ఓ దంపతులు సజీవ దహనం అయ్యారు. మహిళ గర్భిణి కావడంతో విషాదం నెలకొంది. కారు డోర్లు లాక్ అయిపోవడంతో తప్పించుకోలేకపోయారు. 

కేరళ : కేరళలోని కన్నూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులను ప్రజిత్, అతని భార్య రీషాగా గుర్తించారు. ఈ విషాద సంఘటన కన్నూర్ నగరంలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది.

ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. కారు నడుపుతున్న గర్భిణి భర్త, గర్భిణి ముందు సీట్లలో, మరో నలుగురు వెనుక సీట్లలో ఉన్నారు. ప్రమాదం జరగగానే వెంటనే వెనకసీట్లలో ఉన్న నలుగురు కారులో నుంచి బయటపడ్డారు. కానీ కారు డోర్ జామ్ కావడంతో ముందు సీట్లో ఉన్న ఇద్దరు తప్పించుకోలేకపోయారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. త‌మిళ‌నాడు స‌హా ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.ఆరుగురు సభ్యుల కుటుంబం ఆసుపత్రికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఒక నివేదికలో తెలుస్తోంది. మృతులను కుట్టియత్తూరు స్థానికులు రీషా (26), ఆమె భర్త ప్రజిత్ (32)గా గుర్తించారు. ఈ బాధాకరమైన ఘటనను కళ్ల ముందే గమనించిన స్థానికులు, తొలుత డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రజిత్ కాళ్లకు మంటలు అంటుకున్నాయని చెప్పారు. అతను వెంటనే కారు ఆపి వెనుక తలుపులు తెరిచాడని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ మలయాళ మనోరమ తెలిపింది.

వెనుక ఉన్న వ్యక్తులు కారు నుండి బయటకు పరుగెత్తుతుండగా, ప్రజిత్ ముందు తలుపు తెరవడంలో విఫలమయ్యాడు. కారులో ఇరుక్కుపోయిన దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. ఆ జంట సహాయం కోసం కేకలు వేయడంతో ఏం చేయలేక స్థానికులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu