ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఇద్దరు ప్రయాణికులు చలిని బీట్ చేయడానికి నిప్పు పెట్టారు. పిడికలతో మంట అంటించి చలి కాచుకున్నారు. గేట్ మెన్ ఉన్నత అధికారులను అలర్ట్ చేయడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు.
Bonfire: వారంతా అసోం నుంచి అలీగడ్ వైపు సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారు. జనవరి 3వ తేదీన వారు ప్రయాణిస్తుండగా ప్రయాణికులు విపరీతమైన చలితో బిగుసుకుపోయి ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు చలి నుంచి రక్షణగా రగ్గులు కప్పుకోకుండా.. కదిలే ట్రైన్‌లో నిప్పు ముట్టించాలని అనుకున్నారు. అంతేనా, ఆ సాహసానికి ఒడిగట్టారు. కదిలే ట్రైన్‌లోనే వారు పిడకలు తీశారు. వాటికి నిప్పు పెట్టి చలికాచుకున్నారు. ఓ కంపార్ట్‌మెంట్ నుంచి పొగ బయటికి రావడాన్ని పసిగట్టిన ఓ గేట్ మెన్ వెంటనే ఉన్నత అధికారులను అలర్ట్ చేశారు. దీంతో భారీ ప్రమాదాన్ని తప్పించారు.
బర్హన్ రైల్వే స్టేషన్ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా జనవరి 3వ తేదీన రాత్రిపూట ఆ గేట్ మెన్‌కు ఓ కోచ్‌లో ఫ్లాష్ లైట్‌గా మంట కనిపించింది. ఆయన వెంటనే బర్హన్ రైల్వే స్టేషన్‌లోని ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. తర్వాతి స్టేషన్ చామరౌలాలో ట్రైన్ ఆపడానికి ఆదేశాలు వచ్చాయి. తద్వార ఆర్పీఎఫ్ టీమ్ ట్రైన్‌లోకి ఎక్కారు.
undefined
Also Read: KCR: మళ్లీ ఎన్నికల రంగంలోకి కేసీఆర్.. ఆరు నెలల గడువు ఉత్తమాటేనా?
ఆర్పీఎఫ్ ఆ ట్రైన్‌లో పరిశీలిస్తుండగా.. కొందరు జనరల్ కోచ్‌లో పెండ పిడికలతో మంట పెట్టినట్టు చెప్పారు. కఠిన చలి నుంచి కాపాడుకోవడానికి చలి మంట కాచుకున్నట్టు ఆర్పీఎఫ్ టీమ్‌కు వివరించారు. ఆ మంటను వెంటనే ఆర్పేశారు. పెను ప్రమాదాన్ని అధికారులు నివారించారు. అలీగడ్ జంక్షన్ వద్ద 16 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు.
ఫరీదాబాద్‌కు చెందిన చందన్, దేవేంద్రలు నిప్పు అంటించినట్టు తేలింది. దీంతో వారిద్దరినీ ఐపీసీ, రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ల కింద జైలుకు పంపారు. మిగిలిన 14 మంది సహ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.