ఆదిత్య ఎల్ -1 తుది కక్ష్యలోకి చేరింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఆదిత్య ఎల్-1 ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: ఆదిత్య ఎల్ 1 వ్యోమ నౌక శనివారంనాడు తుది కక్ష్యలోకి ప్రవేశించింది.ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీహరికోట నుండి శాస్త్రవేత్తలు వ్యోమనౌకను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు.
also read:నేడు తుది కక్ష్యలోకి :అందరి చూపు ఆదిత్య ఎల్-1పైనే
2023 సెప్టెంబర్ 2 వ తేదీన ఆదిత్య ఎల్ -1 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. ఈ127 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తుది కక్ష్యలోకి చేరింది.ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్ -1 సేవలను అందించనుంది. సూర్యుడికి సమీపంలోని లాంగ్రాజ్ పాయింట్ హాలో కక్ష్యలోకి ఇవాళ సాయంత్రం ఆదిత్య ఎల్ -1 శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు
India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…
— Narendra Modi (@narendramodi)
ఆదిత్య ఎల్-1 తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఆదిత్య ఎల్ -1 విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశించడం మరో ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుందని మోడీ పేర్కొన్నారు.
అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రను సాధించడంలో భారత శాస్త్రవేత్తుల అచంచలమైన అకింతభావాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. మానవాళి మెరుగుదలకు ఈ ప్రయోగాలు పనికొస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు . కొత్త శాస్త్రీయ పరిధులను అన్వేషించడానికి భారత్ నిబద్దతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని మోడీ చెప్పారు.
ఆదిత్య ఎల్-1 ద్వారా చేయనున్న పరిశోధనలు
సూర్యుని బయటి పొరలు ఎలా వేడేక్కుతున్నాయో అధ్యయనం చేయనున్నారు.సూర్యుని చుట్టూ ఉన్న కణాలు ప్లాస్మా వాటి గతిశీలతను అధ్యయనం చేయడానికి డేటాను సేకరించనున్నారు. సౌర కొరొనా , దాని లూప్ ల ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను కూడ అధ్యయనం చేయనున్నారు. సౌర తుఫానులకు గల కారణాలను కూడ అధ్యయనం చేయనున్నారు శాస్త్రవేత్తలు.సూర్యుడి వివిధ పొరలలో సౌర విస్పోటనం సంఘటనలకు దారితీసే ప్రక్రియలపై కూడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.