
తమిళనాడు : బాలికపై molestationకి పాల్పడిని ఇద్దరు వృద్ధులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని మధురైకి సమీపంలో ఓ ప్రాంతానికి చెందిన 15యేళ్ల బాలిక father చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటోంది. ఆకస్మికంగా బాలికకు Stomach ache రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె ఐదు నెలల Pregnant అని నిర్థారించారు. బాధితురాలి తల్లి జరిగిన విషయం గురించి ఆరా తీసింది.
ఇంటికి సమీపంలో ఉంటున్న బాలమురుగన్ అనే వృద్ధుడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ విషయం గురించి తెలుసుకున్న తండ్రి స్నేహితుడైన రమేష్ అనే వ్యక్తి కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడయ్యింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ శుక్రవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, Biharలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కూతురిపై molestation చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన viralగా మారింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో 50 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
నిందితుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, సమస్తిపూర్‌లోని రోసెరాలో నివాసం ఉంటున్నాడు. తన తండ్రి తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అతని 18 ఏళ్ల కూతురు ఆరోపించింది. అంతేకాదు తండ్రి సిగ్గుమాలిన పనిని పట్టించడానికి ఆమె తన తండ్రిని బహిర్గతం చేయడానికి సీక్రెట్ కెమెరాతో అత్యాచారాన్ని షూట్ చేసింది. ఆ తరువాత తనకు న్యాయం చేయాలంటూ కూతురు తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వీడియో వైరల్ కావడంతో, కుమార్తె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. నిందితుడైన తండ్రిని అరెస్టు చేసినట్లు రోసెరా సబ్‌డివిజన్ డీఎస్పీ సహియార్ అక్తర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోలో బాధితురాలిపై దాడి చేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి.. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఇతర నిందితులను స్టేట్‌మెంట్ ఆధారంగా నిర్ధారిస్తున్నారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు... అని DSP సహియార్ అక్తర్ తెలిపారు.
తండ్రిని విచారించిన పోలీసులు ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెబితే.. ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అంతేకాదు ఈ సంఘటనపై మౌనంగా ఉండాలని బాదితురాలి మామ..(తల్లి సోదరుడు)ఆమెను ఒత్తిడి చేసేవాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, రెండున్నరేళ్ల సొంత కూతురిని sexually abuses చేసిన ఓ వ్యక్తికి Thiruvananthapuramలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు తో పాటు.. రూ.50,000 జరిమానా విధించింది. ఈ దారుణ ఘటన ఫిబ్రవరి 2018లో జరిగింది. ఈ కేసులో ఇప్పుడు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
కేసు వివరాల్లోకి వెడితే.. నిందితుడు తన భార్య, బిడ్డలు, అత్తమామలతో కలిసి ఉండేవాడు. రాత్రివేళ భార్య, కూతురు, నిందితుడు ఒకే దగ్గర పడుకునేవారు. కాగా చిన్నారి.. Urination సమయంలో తరచుగా ఏడుస్తూ.. నొప్పితో బాధపడుతుండటం తల్లి గమనించింది. దీంతో ఆమెకు అనుమానం పెరిగింది. చిన్నారిని పరీక్షించగా.. చిన్నారి Private partsపై గాయాలు ఉన్నట్లు తేలింది.