India Pakistan War : పాక్ కాల్పుల్లో ఇద్దరు సామాన్యులు మృతి

Published : May 10, 2025, 08:51 AM ISTUpdated : May 10, 2025, 02:26 PM IST
India Pakistan War : పాక్ కాల్పుల్లో ఇద్దరు సామాన్యులు మృతి

సారాంశం

 జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ దాడుల్లో ఇద్దరు సామాన్య పౌరులతో పాటు అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తాప్ప మృతి చెందారు. 

India Pakistan War : పాకిస్థాన్ దాడుల్లో మరో ఇద్దరు భారత పౌరులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలో ఇద్దరు స్థానికులు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటికే పాక్ దాడిలో ఓ ప్రభుత్వ అధికారి మృతి చెందినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. నిన్న ముఖ్యమంత్రి పాల్గొన్న సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారి మృతి చెందారు. అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తాప్ప రాజౌరీలో మృతి చెందినట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. 

ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి, బార్డర్లో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. భారత సైనికులు, సామాన్య ప్రజలే టార్గెట్ గా ఈ దాడులకు దిగుతోంది. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఇలా తెలుగు జవాన్ మురళీ నాయక్ కూడా చనిపోయాడు. ఇలా సైనికులు, ఇతర అధికారులు, సామాన్యులు పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు... మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. భారత్ కూడా పాక్ దాడులకు ధీటుగా జవాభిస్తోంది. 

 

ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతర సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ఎనిమిది పాక్ నగరాల్లో భారత్ ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామాబాద్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు తాజా వార్తలు వస్తున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్‌కోట్, లాహోర్, పెషావర్, గుజ్రాన్ వాలా, అటోక్ వంటి నగరాల్లో భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాక్ యుద్ధ విమానం కూల్చివేత వంటి వార్తలు కూడా వస్తున్నాయి. మూడు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు పాకిస్తాన్ ఆరోపించింది. అయితే ఈ వార్తలను భారత్ ధ్రువీకరించలేదు.

రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు సంభవించాయి. ఇస్లామాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ విమానాశ్రయంతో సహా మూడు వైమానిక స్థావరాలపై పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్ ధ్రువీకరించింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు