నాలుగేళ్లుగా 40 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఇద్దరు మైనర్లు మాయం..

By AN TeluguFirst Published Jun 14, 2021, 11:16 AM IST
Highlights

జార్ఖండ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లీదండ్రులను కోల్పోయి, ఆదుకునే దిక్కులేక అనాథశ్రమానికి చేరుకున్న చిన్నారులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. నాలుగేళ్లుగా మైనర్లైన చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని జార్ఖండ్ లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థ మీద ఆరోపణలు వచ్చాయి. 
 
సేవ ముసుగులో పుటగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆశ్రమాలు అనాథలు, వృద్ధుల పాలిట నరకకూపాలుగా మారుతున్నాయి. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ (ఎంటీడబ్ల్యూటీ)మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 

ఈ ఆశ్రమంలోని 40 మంది చిన్నారులపై నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేసి, చిన్నారులను శుక్రవారం జంషెడ్పూర్‌లోని గోబర్ఘౌసీలోని బాల్ కల్యాణ్ ఆశ్రమానికి తరలించారు. 

అయితే నలభైమంది పిల్లల్లో 38మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదివారం గుర్తించింది. 17 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయినట్టు తెలిపారు.  

కాగా తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తూర్పు సింగ్భూమ్ సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. తమిళ వనన్ తెలిపారు. ఎంటీడబ్ల్యూటీ డైరెక్టర్ హర్పాల్ సింగ్ థాపర్, ఆయన భార్య పుష్పరాణి టిర్కీ, వార్డెన్ గీతా సింగ్, ఆమె కొడుకు ఆదిత్య సింగ్, మరోవ్యక్తితో సహా  నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఎస్ఎస్పీ  వెల్లడించారు.  

కాగా, మదర్ థెరీసా ట్రస్ట్ డైరెక్టర్ భార్య టిర్కీ, తూర్పు సింగ్భూమ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్ పర్సన్ గా కూడా ఉన్నారని, మదర్ థెరిసా వెల్ఫేర్ ట్రస్ట్ గత 10 సంవత్సరాలుగా ఖరంగజార్లో నడుస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

click me!