75 రోజుల తర్వాత 70 వేలకు దిగువకు కరోనా కేసులు..

By AN TeluguFirst Published Jun 14, 2021, 10:14 AM IST
Highlights

దేశంలో కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతవారం రోజులుగా లక్ష దిగువనే నమోదవుతున్న కేసులు.. నిన్న మరి కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,421 మందికి కరోనా సోకింది. సుమారు 75 రోజుల తరువాత ఈ స్థయి తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం క్రితం రోజుతో పోల్చితే పెరుగుదల కనిపించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. 

నిన్న 14,92,152 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 70,421 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ ఒకటి తరువాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తక్కువగానే ఉండటం కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న 3,921 మరణాలు రికార్డయ్యాయి. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంలో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 2.95కోట్లకు పై బడగా, 3,74,305 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక క్రియాశీల కేసులు 10 లక్షల దిగువకు పడిపోగా.. రికవరీలు 2.81కోట్లకు పైబడ్డాయి. నిన్న ఒక్కరోజూ 1,19,501 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.43 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 3.30శాతానికి తగ్గింది. మరోపక్క 14,99,771మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు అందిన టీకాల సంఖ్య 25,48,49,301గా ఉంది. 

click me!