కాటేసిందని.. బతికున్న పాముని పట్టుకొని..!

Published : Jun 14, 2021, 09:01 AM IST
కాటేసిందని.. బతికున్న పాముని పట్టుకొని..!

సారాంశం

 పొలంలో పని చేస్తున్న జాడప్పను నాగుపాము కాటు వేసింది. అయితే కాడప్ప భయపడకుండా కాటు వేసిన పామును సజీవంగా పట్టుకుని మెట్రి గామంలోని‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. 

ఓ యువకుడిని పాము కాటేసింది. వెంటనే సదరు యువకుడు ఏ మాత్రం భయపడుకుండా.. తనను కాటేసిన పామును ఒడిసి పట్టుకున్నాడు. ఆ పాముని పట్టుకొనే.. ఆస్పత్రికి వెళ్లాడు. తనను కరిచింది ఈ పామే అని చూపించి.. ఆ తర్వాత వైద్యం చేయించుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కంప్లి తాలూకా, ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప‌ అనే యువకుడు పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పని చేస్తున్న జాడప్పను నాగుపాము కాటు వేసింది. అయితే కాడప్ప భయపడకుండా కాటు వేసిన పామును సజీవంగా పట్టుకుని మెట్రి గామంలోని‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. 

అక్కడ డాక్టర్ లేకపోవడంతో స్నేహితుడి సహాయంతో వెంటనే కంప్లి‌ ప్రభుత్వ అసుపత్రికి వెళ్లారు. అక్కడ యువకుడి చేతిలో పామును చూసిన డాక్టర్లు భయపడిపోయి బయటకు వెళ్లమన్నారు.. అనంతరం విషయం తెలుసుకుని కాడప్పకు ప్రథమ చికిత్స చేసి బాళ్లారి విమ్స్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..