మహారాష్ట్ర, గుజరాత్‌లలో మహిళల్లా నటిస్తూ మోసాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్...

Published : May 10, 2023, 04:00 PM IST
మహారాష్ట్ర, గుజరాత్‌లలో మహిళల్లా నటిస్తూ మోసాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్...

సారాంశం

మహిళలుగా తమని తాము పరిచయం చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 

థానే : మహారాష్ట్ర, గుజరాత్‌లలో 19 మందిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. నిందితులు నగల వ్యాపారులు, స్వీట్‌ షాపులు, మెడికల్‌ షాపుల యజమానులతో పాటు బ్లడ్‌ బ్యాంకులను టార్గెట్‌ చేసేవారని మీరా భయందర్‌-వసాయి విరార్‌ పోలీసు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అవిరాజ్‌ కుర్హాడే తెలిపారు.

కాశీమీరా ప్రాంతానికి చెందిన ఓ నగల వ్యాపారి తన దుకాణంలో బంగారు ఆభరణాలు కొనాలనుకుంటున్నానని చెబుతూ మహిళా వైద్యురాలిగా నటిస్తూ నిందితుల్లో ఒకరు తనకు ఫోన్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాము కొనాలనుకుంటున్న నగల కోసం రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని, దానిని తీసుకోవడానికి నగల వ్యాపారిని ఆసుపత్రికి రావాలని నిందితులు కోరారు. నిందితుడు ఆభరణాల వ్యాపారిని ఆసుపత్రికి వచ్చేప్పుడు రెండు లక్షల కరెన్సీని డినామినేషన్ రూపంలో తీసుకురావాలని.. ఆస్పత్రికి సంబంధించిన లావాదేవీల కోసం అది అవసరం అని తెలిపారు. 

పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే బీజేపీ నేతపై దాడి చేసిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో ఇదే

ఆభరణాల వ్యాపారి వివిధ డినామినేషన్లలో రూ 2 లక్షల నగదు తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. అతని వద్ద నుంచి  నిందితులు ఆ డబ్బును తీసుకున్నారు. తరువాత డాక్టర్ కు బంగారు కంకణం కావాలని.. సైజ్ చూసుకోమని.. డాక్టరే రూ. 2 లక్షలు ఇస్తారు, తీసుకోవాలని కోరాడని తెలిపాడు. 

వారి మాటలు నమ్మిన నగల వ్యాపారి ఆసుపత్రి లోపలికి వెళ్లగా, నిందితులు నగదుతో అక్కడి నుంచి పారిపోయారని అధికారులు తెలిపారు. దీంతో వ్యాపారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును విచారిస్తున్నప్పుడు వివిధ లీడ్స్‌పై పని చేసి చివరకు నిందితులు - మనీష్ అంబేకర్, అన్వర్ అలీ కదిర్ షేక్‌లను గుర్తించారు. సోమవారం విరార్ (పాల్ఘర్), అలీబాగ్ (రాయ్‌గడ్) లలో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.9,550 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని విచారించగా, మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, ముంబై, పూణే, నాసిక్, కొల్హాపూర్, గుజరాత్‌లోని వాపి, వల్సాద్, సూరత్‌లకు చెందిన 19 మందిని ఇలాగే మోసం చేసినట్లు తేలిందని తెలిపారు. థానే, పాల్ఘర్, ముంబై, పూణేలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వారిపై ఇప్పటికే పద్నాలుగు నేరాలు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్