సీఎం పై అత్యాచార ఆరోపణలు.. బీజేపీ ఎంపీ పై రూ.100కోట్ల దావా

Published : Aug 08, 2020, 12:48 PM IST
సీఎం పై అత్యాచార ఆరోపణలు.. బీజేపీ ఎంపీ పై రూ.100కోట్ల దావా

సారాంశం

 తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.  

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకి ఊహించని షాక్ తగిలింది. అతనిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రూ.100కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనంటూ సీఎం.. ఈ పరువు నష్టం దావా వేయడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... సీఎం సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ దూబే ట్విటర్‌లో ఆరోపించారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు.

 తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.  

పరువునష్టం దావా వేసిన తరువాత కూడా బీజేపీ ఎంపీ హేమంత్‌ సోరెన్‌పై ట్విటర్‌ వేదికగా బాణాలు కురిపిస్తునే ఉన్నారు. ‘మీపై ముంబైలో ఒక యువతి రేప్‌ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్‌లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్